Home Film News Taapsee: ఆ హీరోలు రాత్రుళ్లు ఫోన్ చేసి ర‌మ్మ‌నేవారు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్
Film News

Taapsee: ఆ హీరోలు రాత్రుళ్లు ఫోన్ చేసి ర‌మ్మ‌నేవారు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్

Taapsee: ఝుమ్మంది నాదం చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ తాప్సీ. ఈ సినిమా త‌ర్వాత తాప్సీ తెలుగులో ప‌లు సినిమాలు చేసింది. ఇక్కడ క‌లిసి రాక‌పోవ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ లేడి ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటించి స్టార్ స్టేట‌స్ అందుకుంది. ఇక బాలీవుడ్‌కి వెళ్లాక బోల్డ్‌గా క‌నిపించ‌డమే కాకుండా  పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడి హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇటీవ‌ల సినిమాల క‌న్నా కూడా కొంద‌రు వ్య‌క్తుల‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తుంది. కంగనా ర‌నౌత్ త‌ర్వాత మ‌ళ్లీ ఫైర్ బ్రాండ్‌గా తాప్సీ పేరు లిస్ట్‌లో చేరింది. తాజా ఇంటర్వ్యూలో ఆమెకు కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న ఎదురు కాగా, దానికి ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

సౌత్‌లో క‌న్నా కూడా బాలీవుడ్‌లోనే ఎక్కువ‌గా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పిన తాప్సీ త‌ను కొత్తలో ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది కాల్స్ చేసి  అర్ధ‌రాత్రి వారి గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు. నేను అలాంటి దాన్ని కాదని చెప్పినా కూడా న‌న్ను చాలా వేధించారు. ఒక‌రిద్ద‌రు హీరోలు అయితే త‌మ‌తో డేటింగ్ చేయాలంటూ చాలా కాలం పాటు వేధించారు కూడా.  సినిమా ఛాన్స్ లు రాకుండా చూస్తామంటూ బెదిరింపుల‌కి కూడా పాల్ప‌డ్డారు. అయితే వాటిని నేను సీరియ‌స్‌గా తీసుకోకుండా న‌న్న నేను న‌మ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తాప్షీ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. తాప్సీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక తాప్సి చివరగా దోబారా, శభాష్ మిథు వంటి చిత్రాల్లో నటించి అలరించింది. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతున్నా కూడా అప్పుడ‌ప్పుడు ప‌లు అవ‌కాశాలు ప‌ల‌కరిస్తూనే ఉన్నాయి. తాప్సీ ఇటీవ‌ల ఎక్కుగా లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లోనే న‌టిస్తుంది. ఇక తాప్సీకి వివాదాలు కొత్త కాదు.ఆ మ‌ధ్య తాను త‌న  క్లీవేజ్ అందాలని కవర్ చేసేందుకు   ఓ భారీ ఆభరణం ధరించి ఉండ‌గా, ఆ ఆభ‌ర‌ణంలో హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మ ఉంది. అసభ్యంగా అందాలు ఆర‌బోస్తూ ఇలా  పవిత్రమైన లక్ష్మీ మాత ఆభరణం ధరించడం ఏంటి అంటూ నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోశారు. దీనిపై తాప్సీ నుండి ఎలాంటి స్పంద‌న రాలేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...