Home Film News Prabha-Maruti: ప్ర‌భాస్‌- మారుతి సినిమాకి స‌రికొత్త టైటిల్‌.. అదిరిందంటున్న ఫ్యాన్స్
Film News

Prabha-Maruti: ప్ర‌భాస్‌- మారుతి సినిమాకి స‌రికొత్త టైటిల్‌.. అదిరిందంటున్న ఫ్యాన్స్

Prabha-Maruti: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. హిట్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాలలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఖాతాలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతి తెర‌కెక్కింనచ‌నున్న చిత్రం ఒక‌టి. అస‌లే వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్న స‌మ‌యంలో మారుతి లాంటి ద‌ర్శకుడితో ప్ర‌భాస్ సినిమా చేయ‌డం అందరిలో కంగారు పెట్టిస్తుంది.అయితే ఈ మూవీ చ‌డీచ‌ప్పుడు లేకుండా సైలెంట్‌గా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక ప్ర‌చారాలు కూడా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం మూవీ టైటిల్ మారిందని సోష‌ల్ మీడియాలో వార్తలు గుప్పుమ‌న్నాయి.

ఇన్నాళ్లు ప్ర‌భాస్- మారుతి సినిమాకి   ‘రాజా డీలక్స్‌’ అని ఫిక్స్‌ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు  ‘వింటేజ్‌ కింగ్‌’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతుంది. మూవీ టైటిల్ బాగుంద‌ని, ప్ర‌భాస్‌కి త‌గ్గ రేంజ్‌లోనే టైటిల్ పెట్టార‌ని కొందరు అంటున్నారు. అయితే ఇందులో  నిజమేంటనేది  అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగక త‌ప్ప‌దు. చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్  నిర్మిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు..  మూవీ ఔట్‌పుట్ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండ‌డంతో సినిమా మంచి హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నారు.

ప్ర‌భాస్‌తో తెర‌కెక్కిస్తున్న సినిమా క‌నుక హిట్ అయిందంటే మారుతి ద‌శ తిరిగిన‌ట్టే. రానున్న రోజుల‌లో అత‌నికి పెద్ద హీరోల సినిమా అవ‌కాశాలు రావ‌డం ఖాయం. ఇక ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం   ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో స‌లార్ చేస్తున్నాడు. ఈ సినిమాలోని తొలి భాగం   ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సెప్టెంబరు 28న విడుదల కానున్న విష‌యం తెలిసిందే. విజయ్‌ కిరగందూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్న‌ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ వర్క్‌ను  ఇటీవ‌ల ఆరంభించారు. మరోవైపు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...