Home Film News Sivaji Movie : సెన్సేషనల్ ‘శివాజి’ కి 15 ఏళ్లు.. మళ్లీ సినిమా ఉందంటగా!
Film News

Sivaji Movie : సెన్సేషనల్ ‘శివాజి’ కి 15 ఏళ్లు.. మళ్లీ సినిమా ఉందంటగా!

Sivaji Movie
Sivaji Movie

Sivaji Movie: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిలిం.. ‘శివాజి’.. భారీ అంచనాలతో 2007 జూన్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ పిక్చర్ 2022 జూన్ 15 నాటికి సక్సెస్‌ఫుల్‌గా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు శంకర్, రజీని కాంత్‌‌ని ఆయన నివాసంలో కలిశారు. షూటింగ్ అప్పటి విషేశాలన, విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలను గురించి చర్చించుకున్నారు. రజినీతో కలిసి ఉన్న పిక్ షేర్ చేశారు శంకర్. తర్వాత వీరి కలయికలో ‘రోబో’, ‘రోబో 2.O’ సినిమాలు వచ్చాయి.

‘శివాజి’ తమిళ్‌తో పాటు తెలుగులోనూ సత్తా చాటింది. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా.. 150 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది. మెసేజ్‌కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి.. తన స్టైల్లో గ్రాండియర్‌గా ఫిలింస్ తీసే శంకర్ ‘శివాజి’ లో రజినీని సరికొత్తగా చూపించారు. రజినీ, శ్రియల కెమిస్ట్రీ, డైలాగ్స్, వివేక్ కామెడీ, ఏ.ఆర్.రెహమాన్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, కె.వి. ఆనంద్ విజువల్స్ సినిమాను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి.

ఇక విలన్ ఆది శేషుగా కనిపించిన సుమన్‌కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పాన్ ఇండియా పేరుతో ఏరియా వైజ్ కలెక్షన్స్, వంద కోట్ల క్లబ్ అనే లెక్కలేస్తున్నారు కానీ అప్పట్లోనే ‘శివాజి’ వంద కోట్ల మార్క్ టచ్ చేసింది. రజినీ-శంకర్ కాంబినేషన్‌లో మళ్లీ సినిమా రాబోతుందా అంటూ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...