Home Film News Hansika: వ‌ద్ద‌న్నా విన‌కుండా ప‌బ్‌లో బ‌న్నీ నాతో ఆ ప‌ని చేయించాడ‌న్న హ‌న్సిక‌
Film News

Hansika: వ‌ద్ద‌న్నా విన‌కుండా ప‌బ్‌లో బ‌న్నీ నాతో ఆ ప‌ని చేయించాడ‌న్న హ‌న్సిక‌

Hansika: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హన్సిక  బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత హీరోయిన్‌గా కూడా రాణించింది. హన్సిక గురించి ఎప్పుడు ఎలాంటి వార్త బ‌య‌ట‌కు వచ్చిన అది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. చిన్నతనంలోనే సీరియల్స్,సినిమాల్లో న‌టించిన హ‌న్సిక త‌న త‌ల్లి ద‌గ్గ‌రే పెరిగింది. హ‌న్సిక చిన్న‌ప్పుడే ఆమె త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించిన హన్సిక‌.. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ దేశముదురు సినిమాలో క‌థానాయిక‌గా న‌టించి తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమైంది. హన్సిక న‌టించిన మొదటి సినిమా హిట్ కొట్టడంతో ఈ అమ్మ‌డికి బాగానే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.  మస్కా  , కంత్రి, కందిరీగ,ఓ మై ఫ్రెండ్ వంటి తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా అవ‌కాశాలు ద‌క్కించుకుంది.

దేశ ముదురు స‌మ‌యంలో జ‌రిగిన ఓ స‌న్నివేశాన్ని హ‌న్సిక ఓ సంద‌ర్భంలో తెలియ‌జేయ‌గా, అది విని ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. .దేశముదురు సినిమాలో నటించే టైంలో నా వయసు 15 సంవత్సరాలు కాగా,  ఆ షూటింగ్ టైం లోనే  నేను 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టాను. అప్పుడు నేను పూరీ జ‌గ‌న్నాథ్‌తో పాటు అల్లు అర్జున్‌కి నా బ‌ర్త్ డే అని చెప్పాను. అప్పుడు వారిద్దరు నన్ను ప‌బ్‌కి తీసుకెళ్లారు. అప్ప‌టివ‌ర‌కు నేను ప‌బ్ చూడ‌లేదు. అయితే వారివ‌ల‌న తొలిసారి ప‌బ్‌కి వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే అక్క‌డ‌కి వెళ్లాక సైలెంట్‌గా కూర్చున్న నా నోట్లో  పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ బ‌ల‌వ‌తంగా వేడి వేడి పాలు నోట్లో పోశారు.ఆ తర్వాత వేరే ఏవేవో నాతో తాగించారు అని హన్సిక చెప్పుకొచ్చింది.

ప‌బ్‌లో నాతో కూడా డ్యాన్స్ చేయించారు అని చెప్పిన హ‌న్సిక వారి వ‌ల్లనే నేను తొలి సారి ప‌బ్‌కి వెళ్లాన‌ని పేర్కొంది. ఇక హ‌న్సిక పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు  అలా సాక్షాత్క‌రింప‌బ‌డుతుంది. ఈ అమ్మ‌డికి  త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు. ఈ భామ‌ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే  గ‌త ఏడాది డిసెంబ‌ర్ 4న‌ పెళ్లి కూడా చేసుకుంది.  ముంబై కి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కథారియాను ప్రేమించిన ఈ భామ‌..  జైపూర్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకుంది.1991 ఆగష్టు 9న ముంబైలో జన్మించిన హన్సిక మోత్వానీ రీసెంట్‌గా త‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంది. పెళ్లి త‌ర్వాత తొలి బ‌ర్త్ డే కావ‌డంతో భ‌ర్త‌తో క‌లిసి ట‌ర్కీ వెళ్లి అక్క‌డ ఎంజాయ్ చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...