Home Film News Big B: వ‌య‌స్సు పెరిగిన బిగ్ బీకి త‌గ్గని క్రేజ్.. కేబీసీ కోసం అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా..!
Film News

Big B: వ‌య‌స్సు పెరిగిన బిగ్ బీకి త‌గ్గని క్రేజ్.. కేబీసీ కోసం అంత రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నారా..!

Big B: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన బిగ్ బీ ఇప్ప‌టికీ సినిమాలు, షోస్ చేస్తూనే ఉన్నారు. 80 ఏళ్లు వ‌య‌స్సులో 20 ఏళ్ళ కుర్రాడిలా  కృషి చేస్తున్నాడు. సినిమాల‌లో కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ మెప్పిస్తున్న బిగ్ బీ ఇప్పుడు  కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ సీజన్  తో సందడి చేయ‌నున్నాడు. అతి త్వ‌ర‌లోనే కొత్త సీజ‌న్ మొద‌లు కానుండ‌గా, ఈ సీజ‌న్‌ని కూడా బిగ్ బీనే హోస్ట్ చేయనున్నాడు. 14 సీజన్లను స‌క్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లిన బిగ్ బీ, తాజా సీజన్ ను మరింత సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు.

తాజా సీజన్ కోసం బిగ్ బీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్  అందుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌ లో ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ. 4 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వ‌బోతున్నార‌ని బాలీవుడ్‌లో టాక్ న‌డుస్తుంది. 2000 సంవత్సరంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తొలి సీజన్ ప్రారంభం కాగా, దీనికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అప్పుడు అమితాబ్ ఒక్క ఎపిసోడ్‌కి కోటి రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునేవార‌ట‌. ఇక 2005లో ప్ర‌సారమైన రెండో సీజ‌న్‌కి ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2 కోట్లు తీసుకున్నారు. మూడో సీజన్ కు సైతం అంతే పుచ్చుకున్నార‌ట‌. ఇక  2010లో 4వ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సీజ‌న్‌లో బిగ్  బీకి కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఇక 6,7 సీజన్లలో మాత్రం అమితాబ్  రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు. 8వ సీజన్ లో  రూ.2 కోట్లు, తొమ్మిద‌వ సీజ‌న్‌లో రూ.2.6 కోట్లు, ప‌దో సీజ‌న్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు రూ.3 కోట్లు ,   11, 12, 13వ సీజన్లలో అమితాబ్‌ ఒక్కో ఎపిసోడ్‌ కోసం రూ. 3.5 కోట్లు తీసుకోగా, ఇప్పుడు 14వ సీజ‌న్‌లో మాత్రం ఏకంగా 14 కోట్లు తీసుకొని రికార్డ్ సృష్టించారు. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షోలో సెల‌బ్రిటీలు కూడా పాల్గొన్నారు. వారిలో  రాణి ముఖర్జీ, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి విద్యాబాలన్, ఆయుష్మాన్ ఖురానా, అమీర్ ఖాన్  త‌దిత‌రులు పాల్గొన్నారు. భారత క్రికెటర్లు సౌరబ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్‌ సహా ప‌లువురు కూడా ఈ షోలో పాల్గొని సంద‌డి చేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...