Home Film News Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌజ్‌లోకి తండ్రి, కొడుకులు.. ఇక ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!
Film News

Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌజ్‌లోకి తండ్రి, కొడుకులు.. ఇక ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Bigg Boss Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో సీజ‌న్ 7 జ‌రుపుకోనుండ‌గా, ఇటీవ‌ల షోకి సంబంధించి చిన్న ప్రోమో విడుద‌ల చేశారు. దీంతో త్వ‌ర‌లోనే బిగ్ బాస్ సీజ‌న్ 7 ప్రారంభం కానుందని ఓ అంచనాకి వ‌చ్చారు. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌ర‌నే దానిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. కాక‌పోతే షోలో వారు వీరు పాల్గొంటున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. ప్రతి సీజన్లోను కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కంటెస్టెంట్స్‌ని ప్ర‌వేశ పెడుతూ షోపై ఆస‌క్తి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ సారి బుల్లి తెర మెగా స్టార్ ప్ర‌భాక‌ర్‌ ని బిగ్ హౌస్ లోకి ప్ర‌వేశపెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం.

యాహు అనే టీవీ షో తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాకర్ ఆ త‌ర్వాత బుల్లితెర‌పై నానా హంగామా చేశాడు. సీరియ‌ల్స్ , షోస్ చేస్తూ అశేష ప్రేక్ష‌కాదర‌ణ ద‌క్కించుకున్నాడు. సీరియల్స్ లో నటించడమే కాకుండా కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించాడు ప్ర‌భాక‌ర్. ఇక సినిమాల‌లోను న‌టుడిగా అద్భుత ప్రద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో పోలీసుగా నటించి ఆకట్టుకున్న ప్రభాకర్.. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల‌లో న‌టించి అల‌రించాడు. ఇప్పుడు ఆయ‌న త‌న కుమారుడిని హీరోగా ప‌రిచయం చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నాడు.

 

ఈ నేప‌థ్యంలో కొడుకుని బిగ్ బాస్ కి పంపాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. బిగ్ బాస్ షోకి వెళితే కొంత పాపులారిటీ ద‌క్కుతుంది కాబ‌ట్టి, ప్ర‌భాక‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు కొడుకుతో పాటు ప్ర‌భాక‌ర్ కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ల‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ఇటీవ‌ల యాటీడ్యూడ్ స్టార్ అని బిరుదు కూడా తగిలించుకున్నాడు. కాస్త డిఫరెంట్ గా.. పొగరుగా ఉన్న ఈ కుర్రాడు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...