Home Film News Sushmita: మెగాస్టార్ కూతురు సుస్మిత ఓ మూవీలో యాక్ట్ చేసిందని తెలుసా?
Film News

Sushmita: మెగాస్టార్ కూతురు సుస్మిత ఓ మూవీలో యాక్ట్ చేసిందని తెలుసా?

Sushmita: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారంతా ప్రజంట్ ఎంతో సక్సెస్ ఫుల్ గా రాణిస్తూ మంచి పేరును సంపాదించుకుంటున్నారు. ఓ సాధారణ హీరో స్థాయి నుండి సినీ ఇండస్ట్రీలో ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా నిహారిక మాత్రమే అడపాదడపా రాణిస్తుంది. నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా మొదట కెరీర్ ను స్టార్ట్ చేసింది. హీరోయిన్ గా మూవీస్ లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా సొంత బ్యానర్ ను స్థాపించింది నిహారిక. అయితే ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఇండస్ట్రీలో ఆఫ్ కెమెరాలో వర్క్ చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. కొన్ని సినిమాలకు సుస్మిత నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. దీంతో పాటు ఆమె వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తున్నారు. అయితే సుస్మిత గురించి చాలామందికి తెలియని ఓ విషయం ఉంది. అదేంటంటే.. సుస్మిత కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేశారని మీకు తెలుసా.. సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారట. అలా అనుకున్న ప్రతి సారి ఏదొక సమస్యతో ఆగిపోయేవారట.
దాంతో మెగాస్టార్ తన ఆలోచనను విరమించుకున్నారు. కానీ సుస్మిత హీరోయిన్ గా ఓ సినిమాలో యాక్ట్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో ఈ సినిమాను రిలీజ్ కూడా చేయలేదట. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సుస్మిత, ఉదయ్ కిరణ్ లు జంటగా యాక్ట్ చేశారట. ఫస్ట్ హాఫ్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక.. సెకండ్ హాఫ్ ను షూటింగ్ కంప్లీట్ చేయలేకపోయారట. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే సుస్మిత లైఫ్ మరోలా ఉండేదని అంటున్నారు సినీ ప్రముఖులు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...