Home Film News Prabhas Fan: ఆదిపురుష్ కోసం మ‌హిళా అభిమాని సాహ‌సం.. ఏకంగా 5500 కిలో మీటర్లు ప్రయాణం
Film News

Prabhas Fan: ఆదిపురుష్ కోసం మ‌హిళా అభిమాని సాహ‌సం.. ఏకంగా 5500 కిలో మీటర్లు ప్రయాణం

Prabhas Fan: బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. బాహుబ‌లి సిరీస్ నుండి ప్ర‌భాస్ అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాలు ప్ర‌భాస్‌కి తీవ్ర నిరాశ‌ని క‌లిగిస్తున్నాయి. ప్ర‌భాస్ న‌టించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డాయి. ఇక రీసెంట్‌గా వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ సినిమాపై కొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేస్తే మ‌రి కొంద‌రు బాగుందంటూ ప్ర‌శంసిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం ప్ర‌భాస్ సినిమా అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే వారిపై చేయి కూడా చేసుకుంటున్నారు.

ఇక ప్ర‌భాస్ కి మ‌న ఇండియాలోనే కాదు జ‌పాన్‌లోను అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న న‌టించిన  బాహుబలి, సాహో సినిమాలు జపాన్ లో భారీ విజయం సాధించాయి.బాహుబ‌లితో ప్ర‌భాస్‌కి వ‌చ్చిన క్రేజ్‌తో అక్కడ కొన్ని వస్తువులు   ప్రభాస్ పేరుమీద బాగా అమ్మ‌డుపోతూ ఉంటాయి. ప్ర‌భాస్ సినిమాల కోసం వారు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే చాలు ఎక్క‌డికైన వెళ్లి సినిమా చూడాల్సిందే అంటారు అక్క‌డ అభిమానులు.  తాజాగా జపాన్ కు చెందిన  ప్రభాస్ మహిళా అభిమాని తమ గ్రామం లో థియేటర్స్ లేకపోతే 5500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వీక్షించింద‌ట‌.

నోరికో అనే జపాన్  మహిళా  ప్రభాస్ కు వీరాభిమాని కాగా, వారి దేశంలో ఆదిపురుష్ చిత్రం రిలీజ్ కాలేదు కాబ‌ట్టి మూవీని ఎలా అయిన చూడాల‌ని భారీ ఖ‌ర్చు చేసి టోక్యో నుండి సింగ‌పూర్ వ‌ర‌కు ప్ర‌యాణించింద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న అక్కడి ఇండియన్స్ ఆమెతో మాట్లాడించి ఓ వీడియోని తీయ‌గా, ప్ర‌స్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ  వైరల్ గా మారింది. అయితే వీడియోలో ఆ మ‌హిళ తెలుగులో మాట్లాడ‌డం విశేషం. ఇక ఆదిపురుష్ విష‌యానికి వ‌స్తే చిత్రానికి సంబంధించిన క‌లెక్ష‌న్స్ క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. బ్రేక్ ఈవెన్ అయిన సాధిస్తుందా లేదా అని కొందరు తెగ చ‌ర్చించుకుంటున్నారు.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...