Home Film News Shamshera Trailer : ‘షంషేరా’ ట్రైలర్ సాలిడ్‌గా ఉందిగా..
Film News

Shamshera Trailer : ‘షంషేరా’ ట్రైలర్ సాలిడ్‌గా ఉందిగా..

Shamshera Trailer
Shamshera Trailer

Shamshera Trailer: భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగడానికి సిద్ధమవుతోంది భారీ బడ్జెట్ ఫిలిం ‘షంషేరా’.. బ్లాక్ బస్టర్ సినిమా ‘సంజు’ తర్వాత రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ‘షంషేరా’ (కర్మ వల్ల దోపిడీ దొంగలం.. ధర్మంగా స్వతంత్రులం) కు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, ప్రోమోస్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘షంషేరా’ లో మునుపెన్నడూ కనిపించని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు రణబీర్. ట్రైలర్ స్టార్టింగ్ నుండి భారీ యాక్షన్ సన్నివేశాలతో, ఆశ్చర్యపరిచే విజువల్స్‌తో అలరిస్తుంది. సంజయ్ దత్ క్యారెక్టర్, గెటప్ క్రూరంగా ఉన్నాయి. రణబీర్, సంజయ్ దత్‌తో తలపడే సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఇక ట్రైలర్ చివర్లో రణ్‌బీర్.. తండ్రీ కొడుకులుగా కనిపించనున్నట్లు రివీల్ చేసి అంచనాలు పెంచేశారు మేకర్స్. వాణీ కపూర్ కథానాయికగా నటించింది. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ‘షంషేరా’ మూవీని జూలై 22 న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...