Home Film News Surya: భార్య‌, పిల్ల‌ల‌తో ముంబై వెళ్లిన సూర్య‌.. కుటుంబంతో గొడ‌వ‌లా!
Film News

Surya: భార్య‌, పిల్ల‌ల‌తో ముంబై వెళ్లిన సూర్య‌.. కుటుంబంతో గొడ‌వ‌లా!

Surya: త‌మిళ న‌టుడు సూర్య గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎంతో టాలెంట్ ఉన్న సూర్య త‌న న‌ట‌న‌తో కేవ‌లం త‌మిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్ష‌కుల‌ని సైతం అలరిస్తున్నాడు. సూర్య చేసిన ప్ర‌తి సినిమా తెలుగులోను విడుద‌ల కావ‌డం, వాటికి మంచి రెస్పాన్స్ రావ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక సూర్య స‌తీమ‌ణి జ్యోతిక కూఆ మంచి న‌టీమ‌ణి కాగా ఆమె పెళ్లి త‌ర్వాత సినిమాలు కాస్త త‌గ్గించింది.కాని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. అయితే సూర్య త‌న భార్య‌, పిల్ల‌ల‌ని తీసుకొని ఇటీవల ముంబై చెక్కేసారు. త‌న తండ్రి, త‌మ్ముడితో వ‌చ్చిన విభేదాల వ‌ల‌నే త‌న ఫ్యామిలీని తీసుకొనొ ముంబై వెళ్లాడ‌ని జోరుగా ప్ర‌చారం న‌డిచింది.

తండ్రి, తమ్ముడితో గొడవల వల్లే సూర్య ముంబైకి వెళ్లి అక్క‌డ స‌ప‌రేట్ ఇల్లు తీసుకొని ఉంటున్నారా. అనే చ‌ర్చ న‌డిచింది. అయితే దీంతో సూర్య అభిమానుల‌లో  కొంత ఆందోళ‌న నెల‌కొంది. అస‌లు నిజ‌మేంటో తెలియ‌క సూర్య ఫ్యాన్స్ చాలా అప్‌సెట్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా  ముంబయిలో నిర్వహించిన ఓ ఫ్యాన్స్ మీట్‌కు హాజరయిన సూర్య‌.. త‌న సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆస‌క్తిక‌ర సమాధానాలూ ఇచ్చారు. ఆయన ముంబయికి మారడం గురించి ఓ ఫ్యాన్ ప్ర‌శ్నించ‌గా, దానికి సూర్య పూర్తి క్లారిటీ ఇచ్చారు.

మీ ఫ్యామిలీతో  విడిపోయి ముంబయిలో ఇల్లు తీసుకుని  ఉంటున్నారా అని గ‌తంలో సూర్య‌ని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆయ‌న ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. కాని తాజాగా ఫ్యాన్ మీట్‌లో అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. తాను త‌మిళ‌నాడు వ‌దిలిపెట్టి ఎక్క‌డికి వెళ్ల‌న‌ని పేర్కొన్నారు. నా జ‌న్మ‌స్థ‌లం వ‌దిలి నేను వేరే చోటికి ఎందుకు వెళ‌తాను. నేను నా కుటుంబంతో ముంబై వెళ్ల‌డానికి కార‌ణం నా పిల్ల‌లు. వారి చ‌దువుల కోస‌మే అక్క‌డికి వెళ్లానే తప్ప మ‌రో కార‌ణం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాను ఎప్పటికీ తమిళనాడులోనే ఉంటానని సూర్య తెలియ‌జేయ‌డంతో ఇన్నాళ్లు సూర్య గురించి వ‌చ్చిన రూమ‌ర్స్ కి చెక్ ప‌డింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...