Home Film News Sanjay Dutt: సంజ‌య్ ద‌త్ త‌ల‌కి బ‌ల‌మైన గాయం.. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్ద‌న‌లు
Film News

Sanjay Dutt: సంజ‌య్ ద‌త్ త‌ల‌కి బ‌ల‌మైన గాయం.. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానుల ప్రార్ద‌న‌లు

Sanjay Dutt: మున్నాభాయ్ సంజయ్ ద‌త్ హిందీ ప్రేక్ష‌కులతో పాటు తెలుగు ప్రేక్షకుల‌కి  కూడా చాలా సుప‌రిచితం. ఆయ‌న ఒక‌ప్పుడు హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్నాడు. ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఇక ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నాడు. తెలుగు, త‌మిళం, హిందీ  భాష‌ల‌లో న‌టిస్తూ సంజ‌య్ తెగ వినోదాన్ని పంచుతున్నాడు. ప్ర‌స్తుతం సంజ‌య్ ద‌త్.. రామ్, పూరీ జ‌గ‌న్నాథ్‌ కాంబోలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంక‌ర్ సీక్వెల్ చిత్రంలో న‌టిస్తున్నారు. డ‌బుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం   థాయిలాండ్ లో  షూటింగ్ జ‌రుపుకుంటుంది. పూరీ.. సంజ‌య్ ద‌త్‌పై  యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తుండ‌గా, ఆయ‌న‌కి పెద్ద ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.

యాక్షన్ సీక్వెల్స్ ను తెరకెక్కించే స‌మ‌యంలో సంజయ్ దత్ త‌ల‌కి గాయ‌మైన‌ట్టు తెలుస్తుంది. కత్తితో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న త‌ల‌కి గాయం అయింద‌ని, రెండు కుట్లు కూడా వేసార‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. గాయ‌మైన‌ప్ప‌టికీ సంజ‌య్ ద‌త్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నార‌ని తెలియ‌జేయ‌గా, వ‌ర్క్‌పై ఆయ‌నకి ఉన్న క‌మిట్‌మెంట్ ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. అంతేకాదు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే సంజ‌య్ ద‌త్..  ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ కన్నడ చిత్ర షూటింగ్  స‌మ‌యంలో కూడా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే.  ధృవ సర్జా సినిమా షూటింగ్ లో భాగంగా బెంగళూరు లోకేషన్ లో బాంబు పేలుడు సీన్ స‌మ‌యంలో సంజ‌య్ ద‌త్ గాయ‌ప‌డ్డారు.

అప్పుడు సంజ‌య్ ద‌త్   మోచేయి, చేతులు, ముఖానికి గాయాలు కాగా, ఆయ‌న త్వ‌ర‌గానే కోలుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న గాయ‌ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇక సంజ‌య్ ద‌త్..   ‘డబుల్ ఇస్మార్ట్’లో   బిగ్ బుల్ అనే విల‌న్ పాత్రలో క‌నిపించి సంద‌డి చేయనున్నారు. ఇటీవ‌ల ఆయన బ‌ర్త్ డే సంద‌ర్భంగా  ఫస్ట్ లుక్ పోస్టర్  విడుద‌ల చేయ‌గా,  మాస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ కు మంచి  రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికే ఈ మూవీ ముంబైలో ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం థాయ్‌లాండ్ లో వ‌డివ‌డిగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.  పూరీ, ఛార్మీ కౌర్  నిర్మాతలు గా పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నఈ చిత్రాన్ని  2024 మార్చి  8న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...