Home Film News బాలకృష్ణను ‘బాలయ్య’ అన్నీ ఎందుకు అంటారు.. బాల‌య్య పేరు వెనుక‌ ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!
Film News

బాలకృష్ణను ‘బాలయ్య’ అన్నీ ఎందుకు అంటారు.. బాల‌య్య పేరు వెనుక‌ ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

నటరత్న నందమూరి తారక రామారావు గురించి ఎన్నిసార్లు ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఈనాడు ఇలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం నటరత్న ఎన్టీఆర్. ఆయన తర్వాత చిత్ర పరిశ్రమకు ఆయన వారసులుగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన నట‌సింహం నందమూరి బాలకృష్ణ ముందుగా తన తండ్రి తన అన్నతో కలిసి తాతమ్మ కళా సినిమాతో తెలుగులో బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ నటుడుగా అనిపించుకున్నాడు.

Nandamuri Balakrishna on X: "When a cult fan writes scene for his hero then  the result be like:- 👇 #NandamuriBalakrishna https://t.co/Kqq8VZs3PK" / X

అదే సమయంలో సీనియర్ దర్శ‌కుడు కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో హీరోగా తొలి ఇండస్ట్రీ హీట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలనే వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు.. ఇప్పటికే అఖండ, వీర‌ సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న బాలకృష్ణ..త‌న సినిమాలతోనే కాకుండా బుల్లితెరపై కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు.

Lorry Driver Telugu Movie || Balakrishna, Vijayashanti || Ganesh Videos -  YouTube

ఇప్పటికే ఆహాలో వచ్చిన అన్ స్టాప‌బుల్ షో తో తనలోని కొత్త బాలకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇదే సమయంలో ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..బాలకృష్ణకు ‘బాలయ్య’ అనే పేరు ఎలా వచ్చింది. బాలకృష్ణను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో ఉన్న వారందరూ కూడా బాలయ్య అని పిలుస్తూ ఉంటారు. ఇదే సమయంలో అసలు బాలకృష్ణకు బాలయ్య అనే పేరు ఎలా వచ్చింది అనేది ఎవరికీ పెద్దగా తెలియదు. ఇక ఈ పేరు వెనక ఎవరికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది.

HBD NBK - B Gopal: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నట సింహా బాలకృష్ణ,  దర్శకుడు బి గోపాల్ – News18 తెలుగు

బాలకృష్ణ సీనియర్ దర్శకుడు బి.గోపాల్ కాంబోలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయింది. 1990లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్యకు అదిరిపోయే బంపర్ హిట్ ని ఇచ్చింది. ఆదే స‌మ‌యంలో ఈ సినిమాలోని పాటలు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.

Balakrishna All Time Super Hit Song - Balayya Balayya Gundello Golayya | Lorry  Driver Movie - YouTube

అదే క్ర‌మంలో ఈ సినిమా దర్శకుడు బి.గోపాల్ మీరు ఏ పాటైనా రాయండి ఇందులో ఒక పాటలో ‘బాలయ్య.. బాలయ్య’ అన్నీ ఉండాలని అంటూ ఖచ్చితంగా చెప్పారు. ఇక దాంతో రచయిత జొన్నవిత్తుల ‘బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య’ అనే పాటను రాశారు. ఆ పాట సినిమాతో పాటుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటినుంచి బాలకృష్ణను ‘బాలయ్య’ అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఈ విధంగా బి. గోపాల్ రాపిచ్చుకున్న పాట ద్వారా బాలకృష్ణకు ‘బాలయ్య’ అనే పేరు వచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...