Home Film News Sreemukhi: పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న శ్రీముఖి.. అలాంటి వ్య‌క్తి త‌న‌కి కావాలట‌..!
Film News

Sreemukhi: పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న శ్రీముఖి.. అలాంటి వ్య‌క్తి త‌న‌కి కావాలట‌..!

Sreemukhi: సాధార‌ణంగా సెల‌బ్రిటీలు పెళ్లికి ఆమ‌డ దూరంలో ఉంటారు. కెరీర్ సెటిల్ అయిన‌ప్పుడు లేదంటే 34 ఏళ్ల త‌ర్వాత‌నో పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తుంటారు. ప్ర‌భాస్ కి నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటిన ఇంకా పెళ్లి ముచ్చ‌ట ఎత్త‌ట్లేదు. అలాంటి జాబితా ఇండ‌స్ట్రీలో చాలానే ఉంది. అయితే బుల్లితెర రాములమ్మగా మస్త్ పాపులర్ అయిన శ్రీముఖి పెళ్లి గురించి త‌ర‌చు వార్త‌లు వ‌స్తుంటాయి. ఆ వార్త‌ల‌పై కొద్ది సార్లు స్పందిస్తుంటుంది, మ‌రి కొన్ని సార్లు లైట్ తీసుకుంటుంది. తాజాగా ఆమె పెళ్లి విష‌యంలో ఫిలిం న‌గ‌ర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీముఖి త‌న  మాటలతో మాయ చేయడంలో  చేస్తూ టాప్ యాంకర్ గా ఎదిగింది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది బ్యూటీల్లో శ్రీముఖి ఒకరు అని చెప్పాలి.

ఒక‌ప్పుడు సినిమాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి ప‌టాస్ షోతో యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ షో చేస్తూ కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తుంది. అన‌సూయ‌, ర‌ష్మీ,విష్ణుప్రియ‌ల‌కి తానేమి త‌క్కువ కాద‌ని త‌న సొగ‌సుల‌తో మ‌త్తెక్కిస్తుంది.  మోడ్రన్ దుస్తులతో పాటు సంప్రదాయ దుస్తుల‌లో శ్రీముఖి చేస్తున్న అందాల జాత‌ర‌కి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అయితే యాంకర్ శ్రీముఖి  ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యిందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట‌ హాట్ టాపిక్ గా మారాయి. శ్రీముఖి  గ‌తంలో ఒక సందర్భంలో 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.

ఈ అమ్మ‌డు 30 ప్లస్ లో అడుగుపెట్ట‌డంతో పెళ్లి రూమ‌ర్స్ ఊపందుకున్నాయి.  హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను శ్రీముఖి పెళి చేసుకోబోతుందని కొంద‌రు అంటున్నారు. ఆమె చేసే ఫోటో షూట్స్ చూసి ఈ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ‌రి కొంద‌రేమో ఓ  ఫొటోగ్రాఫ‌ర్‌తో ఏడ‌డుగులు వేయ‌నుంద‌ని చెబుతున్నారు. ఇప్పుడు శ్రీముఖి పెళ్లి వార్తలు మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి వీటిపై ఈ అమ్మ‌డు స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. తనదైన చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న శ్రీముఖి.. పెళ్లి చేసుకొని పిల్లాపాపల‌తో సంతోషంగా ఉంటే చూడాల‌ని ఓ వ‌ర్గం భావిస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...