Home Film News Akkineni Hero Names: అక్కినేని హీరోల పేర్ల ముందు నాగ అని ఉండ‌డం వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా?
Film News

Akkineni Hero Names: అక్కినేని హీరోల పేర్ల ముందు నాగ అని ఉండ‌డం వెన‌క ఇంత పెద్ద క‌థ ఉందా?

Akkineni Hero Names: అప్ప‌టితరం హీరోల‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఒక‌రు కాగా, ఆయ‌న ఎన్నో సినిమాల‌లో వైవిధ్య‌మైన పాత్రలు పోషించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచారు. ఎన్టీఆర్‌కి పోటీగా నాగేశ్వ‌ర‌రావు సినిమాలు విడుద‌లై మంచి విజయం సాధించిన సంద‌ర్భాలు కూడా అనేకం. ఈ త‌రం వారికి కూడా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు తెలిసే ఉంటారు. ఇక ఆయ‌న త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నాగార్జున కూడా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్న నాగార్జున‌..భ‌క్తిర‌స చిత్రాల‌లోను అద్భుతంగా న‌టించ‌గ‌ల‌న‌ని నిరూపించాడు. అన్న‌మ‌య్య‌,  శ్రీరామ‌దాసు వంటి చిత్రాల‌లో నాగార్జున త‌న న‌ట‌నతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

అక్కినేని నాగార్జున వార‌సుడిగా  ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైత‌న్య కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న చైత‌న్య ఇటీవ‌ల క‌స్ట‌డీ అనే చిత్రంతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ఇదిలా ఉంటే  అక్కినేని హీరోల పేర్ల ముందు ప్రతి ఒక్కరికి నాగ అనే పేరు ఉండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇందుకు  గల కారణాలు చాలా మందికి తెలియదు. అయితే ఆ పేరు వెనుక  ఉన్న ర‌హ‌స్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

అక్కినేని నాగేశ్వరరావు త‌న త‌ల్లి కడుపులో ఉన్నప్పుడు ఆమెకి  తరచూ కలలో నాగుపాములు కనిపించేవట. ఆ స‌మ‌యంలో  నాగేశ్వరరావు తల్లి దేవునికి మొక్కుకొని మా కుటుంబంలో ప్రతి ఒక్కరి పేర్ల ముందు నాగ అనే పేరుని పెట్టుకుంటామని ప్రార్థించార‌ట‌. ఆ కార‌ణం వ‌ల్ల‌నే అక్కినేని వార‌సుల పేర్ల ముందు నాగ అనే పేరును చేర్చుతున్నారు. ఇప్పటి వారసత్వంలో నాగచైతన్యకి ఆ పేరును పెట్ట‌గా,  అఖిల్ పేరు ముందు నాగ అనే పేరుని చేర్చలేదు.  చైతూ, అఖిల్ల‌ తోటి హీరోలు వంద కోట్ల క్ల‌బ్‌లోకి వెళ్లిన కూడా ఇప్పటికీ ఆ హీరోలు ఆ టార్గెట్ రీచ్ కాక‌పోవ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...