Home Film News Pawan: కొడుకుకి జ‌న‌సేన పేరు పెట్టిన ఫ్యాన్.. ఇలాంటి ఘ‌న‌త ప‌వ‌న్ ఒక్క‌డికే సాధ్యం..
Film News

Pawan: కొడుకుకి జ‌న‌సేన పేరు పెట్టిన ఫ్యాన్.. ఇలాంటి ఘ‌న‌త ప‌వ‌న్ ఒక్క‌డికే సాధ్యం..

Pawan: మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన త‌మ్ముడు, బ‌ద్రి, తొలి ప్రేమ వంటి చిత్రాలు ప‌వ‌న్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తొలి ప్రేమ త‌ర్వాత ప‌వ‌న్‌ని వ‌రుస ఫ్లాపులు చ‌విచూసిన ఆయ‌న క్రేజ్ త‌గ్గేలేదు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో మంచి హిట్ కొట్టి ఇక త‌న హ‌వా చూపిస్తున్నాడు. కోట్ల ఆస్తులు, మంచి స్టార్ డం ఉన్నా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాజానికి ఏదో ఒక సేవ చేయాల‌ని ఎంతో త‌పన ప‌డుతూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన అనే పార్టీ స్థాపించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అభిమానుల‌కి ఎంత ప్రేమ ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాధార‌ణంగా అభిమానులు త‌మ హీరో పుట్టినరోజున రక్తదానం చేస్తే , మ‌రి కొంద‌రు అన్నదానం చేస్తుంటారు. ఇంకొందరు ఫ్యాన్స్ మాత్రం ఫ్లెక్సీల ద్వారా తమకు ఇష్టమైన హీరోలపై అభిమానాన్ని చాటుకోవడం జరుగుతుంది. అయితే అంద‌రి హీరోల అభిమానుల కన్నా ప‌వ‌న్ అభిమానులు వేరు. ఆయ‌న‌కి అభిమానుల కన్నా భ‌క్తులు అంటారు. ప‌వ‌న్‌ని వాళ్లింట్లో వాళ్ల క‌న్నా ఎక్కువ‌గా ప్రేమిస్తుంటారు. కొంద‌రు అభిమానులు ప‌వ‌న్ ఫొటోని బైకుల‌పై, ఇళ్ల‌ల్లోను పెట్టుకుంటారు. ఇంకొంద‌రు త‌మ వెడ్డింగ్ కార్డ్‌పై కూడా ప‌వ‌న్ ఫొటో ముద్రిస్తారు.

 

ఇలా ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌మ అభిమానాన్ని చూపించుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని ఒకరు తన కొడుకుకు జనసేన ని పేరు పెట్టారు.కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతు పెళ్లికి ముందే త‌న‌కి గ‌నుక‌ కొడుకు పుడితే ఆ కొడుకుకు జనసేన అని పేరు పెడతానని దేవుడిని మొక్కాడ‌ట‌..పెళ్లైన తర్వాత కొడుకు పుట్టడంతో మొక్కు తీర్చుకోవాలని పుట్టిన ఇద్దరు మగ కవలలలో ఒకరికి జనసేన అని పేరు పెట్టడం జరిగింది. బాల్యం నుంచి త‌న‌కు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అభిమానం అని చెప్పిన హ‌నుమంతు ఆ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాట్టు తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...