Home Film News Sai Dharam Tej: కోమాలో ఉన్న‌ప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వ‌డం వ‌ల‌న ఆ ప‌ని చేయ‌లేక‌పోతున్నా..
Film News

Sai Dharam Tej: కోమాలో ఉన్న‌ప్పుడు స్టెరాయిడ్స్ ఇవ్వ‌డం వ‌ల‌న ఆ ప‌ని చేయ‌లేక‌పోతున్నా..

Sai Dharam Tej: మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి హీరోగా అడుగుపెట్టి తనకంటూ ప్ర‌త్యేక గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే… పిల్ల నువ్వులేని జీవితం సినిమా ద్వారా ఇండ‌స్ట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత రేయ్ చిత్రం చేయ‌గా, ఈ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత హిట్స్, ఫ్లాప్స్ తేడా లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఇక ఇటీవల విరూపాక్ష సినిమాతో త‌న కెరీర్‌లో పెద్ద స‌క్సెస్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బ్రో అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతంకి రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేయ‌నున్నారు.

చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా సినిమాకి సంబంధించిన పాటల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు. ఆ పాట‌ల‌లో సాయిధరమ్ తేజ్ మునుపటి డ్యాన్స్ మూమెంట్స్, ఆ హుషారు కనిపించడం లేదని కొంద‌రు కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించాడు. గ‌త ఏడాది జ‌రిగిన బైక్ ప్ర‌మాదం వ‌ల‌న కొన్నాళ్ల పాటు సాయి తేజ్ కోమాలో ఉన్నాడు.అప్పుడు చాలా మందులు వాడారు. వాటి వల్ల తేజూ బాడీలో కొన్ని చిన్న సమస్యలు ఏర్ప‌డ్డాయ‌ని చెప్పుకొచ్చాడు. త‌న డ్యాన్స్ లు చూసి తానే నిరాశ చెందుతున్నాన‌ని చెప్పిన సాయి తేజ్.. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అయితే దానిని సాకుగా చూపి నేను డ్యాన్స్ వేయ‌కుండా ఉండ‌ను.

 

మునుపటికంటే ధీటుగా ఫ్యాన్స్ కోరుకున్న‌ట్టు డ్యాన్స్ చేయగలను. అయితే హీల్ కావడానికి కొంత టైం పడుతుంది. ఫిజికల్ గా మూవ్ కావడం మాత్రమే కాదు బాడీ లో కొన్ని సమస్యలు అలానే ఉన్నాయి. యాక్సిడెంట్ జ‌రిగిన త‌ర్వాత క‌నీసం మాట కూడా రాలేదు. ఇప్ప‌డు దానిని అధిగ‌మించాను. స్టెరాయిడ్స్ ఇవ్వ‌డం వ‌ల‌న అవి నా బాడీపై తీవ్రంగా చూప‌డంతో ఫిట్‌నెస్ కోల్పోయాను. ఇప్పుడు దానిని పొందేందకు కృషి చేస్తున్నాను.త్వ‌ర‌లోనే వాట‌న్నింటిని అధిమించి మునుపటికంటే బాగా డ్యాన్స్ చేస్తా అని సాయి తేజ్ ప్రామిస్ చేశాడు. ఇక ఆయ‌న త్వ‌ర‌లో సంపత్ నంది దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా క‌న్నా ముందు తాను బాడీ ఫిట్ నెస్, ఇతర సమస్యలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...