Home Film News Allari Naresh : ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం’.. నరేష్ పర్ఫార్మెన్స్ అదిరింది..
Film News

Allari Naresh : ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం’.. నరేష్ పర్ఫార్మెన్స్ అదిరింది..

Itlu Maredumilli Prajaneekam
Itlu Maredumilli Prajaneekam

Allari Naresh: దర్శక దిగ్గజం ఈవీవీ సత్యనారాయణ నటవారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఫస్ట్ సినిమా ‘అల్లరి’ తో ‘అల్లరి’ నరేష్‌గా స్థిరపడిపోయాడు. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ‘నేను’, ‘గమ్యం’ లాంటి విభిన్నమైన సినిమాలతోనూ ఆకట్టుకుని వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ‘నాంది’ తో లాంటి సీరియస్ సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి.. నరేష్ ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ అయినా చెయ్యగలడని ఇండస్ట్రీ వారు, ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేశాడు. ప్రస్తుతం సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నారు. గురువారం (జూన్ 30) నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఇట్లు మారుడుమిల్లి ప్రజానీకం’ టీజర్ రిలీజ్ చేశారు. నరేష్ నటిస్తున్న 59వ సినిమా ఇది.

జీ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్ల మీద రాజేష్ దండు నిర్మిస్తుండగా.. ఎ.ఆర్.మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆనంది కథానాయిక. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది.

నరేష్ క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉన్నాయి. టీజర్ ద్వారా క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారూ’ అంటూ అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. త్వరలో ‘ఇట్లు మారుడుమిల్లి ప్రజానీకం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...