Home Film News Salman Khan: స‌ల్మాన్ ఖాన్‌ని ఖ‌చ్చితంగా చంపేస్తాం.. అందులో డౌటే లేదు..
Film News

Salman Khan: స‌ల్మాన్ ఖాన్‌ని ఖ‌చ్చితంగా చంపేస్తాం.. అందులో డౌటే లేదు..

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌కి ఆసియా వ్యాప్తంగా అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని ద‌శాబ్ధాలుగా బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న స‌ల్లూభాయ్ ఇటీవ‌ల వాల్తేరు వీర‌య్య చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రించాడు. ఐదు ప‌దులు దాటిన కూడా స‌ల్మాన్ ఖాన్ త‌న సినిమాల స్పీడ్ త‌గ్గించ‌డం లేదు. హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన సినిమాలు చేస్తున్నాడు. అయితే స‌ల్మాన్ ఖాన్‌కి ఇటీవ‌లి కాలంలో డెత్ త్రెట్స్ ఎక్కువ‌య్యాయి. ఆయ‌న‌ని చంపేస్తామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో స‌ల్మాన్ త‌న సెక్యూరిటీని కూడా మ‌రింత‌గా పెంచేశాడు. అయితే తాజాగా  తమ హిట్‌లిస్టులో స‌ల్మాన్  ఉన్నాడని, అతడిని కచ్చితంగా చంపి తీరుతామని గ్యాంగ్‌స్టార్‌ గోల్డీ బ్రార్‌ హెచ్చరించాడు.

గోల్డీ బ్రార్ తాజాగా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌ని క‌చ్చితంగా హతమారుస్తాం. భాయ్‌ సాబ్‌ (లారెన్స్‌ బిష్ణోయ్‌)కూడా అతడిని క్షమించబోనని ఇప్పటికే చెప్పారు అని ఆయ‌న అన్నారు..  మేము బతికున్నంత కాలం.. మా శత్రువులను తొలగించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఈ విష‌యంలో  మేము కచ్చితంగా విజయం సాధిస్తాము. అది అందరికీ తెలుసు,” అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్  చెప్పుకొచ్చాడు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను గోల్డీ బ్రార్‌ ముఠా కాల్చి చంపిన విష‌యం తెలిసిందే.

జైలులో ఉన్న బిష్ణోయ్‌.. సల్మాన్‌ను చంపడమే తన లక్ష్యమని జైలు నుంచే హెచ్చరికలు కూడా జారీ చేశాడు. కెనడాలో మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ బ్రార్‌ కోసం ఆ దేశ పోలీసులు తెగ‌ గాలిస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్ పై వారికి అంత పగ ఎందుకు అంటే.. 1998లో కృష్ణ జింకలను వెంటాడినట్టు సల్మాన్ ఖాన్పై ఆరోపణలు వచ్చిన విష‌యం తెలిసిందే. బిష్ణోయ్ తెగకు ఈ కృష్ణ జింకలు అత్యంత పవిత్రమైనవి కాబ‌ట్టి.. గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ వంటి క్రిమినల్స్.. సల్మాన్పై పగబట్టారు. ఏదో ఒక రోజు ఆయ‌న‌ని క‌చ్చితంగా చంపి తీరుతామ‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...