Home Film News Ravi Kumar: వాడొక హీరోనా అంటూ ఆ డైరెక్ట‌ర్ అంత దారుణంగా అన్నాడేంటి..!
Film News

Ravi Kumar: వాడొక హీరోనా అంటూ ఆ డైరెక్ట‌ర్ అంత దారుణంగా అన్నాడేంటి..!

Ravi Kumar: ఇటీవ‌ల చాలా మంది త‌మ టాలెంట్‌తో క‌న్నా కాంట్ర‌వ‌ర్సీస్‌తో ఎక్కువ ఫేమ‌స్ అవుతున్నారు. ఎవ‌రో ఒక‌రిని తిట్ట‌డం, లేని పోని ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల‌న వార్త‌ల‌లో నిలిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ద‌ర్శ‌కుడు ఏఎస్ ర‌వి కుమార్ .. ఒక హీరోపై దారుణ‌మైన కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వివ‌రాల‌లోకి వెళితే   ఏఎస్ రవికుమార్ చాలా రోజుల త‌ర్వాత  మళ్లీ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరాసామి అనే టైటిల్ తో యాక్షన్ ప్యాక్డ్ లవ్ స్టోరీ తెరకెక్కించ‌గా, ఇటీవ‌ల  ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ చూసి  అటు ఏఎస్ రవికుమార్ చౌదరి.. ఇటు రాజ్ తరుణ్ కు మంచి హిట్ రాబోతోంది అంటూ కొంద‌రు చ‌ర్చించుకున్నారు. అయితే  టీజర్ రిలీజ్ కార్యక్రమంలో డైరెక్టర్ మన్నారా చోప్రాకు ఆయ‌న ముద్దు పెట్టి హాట్ టాపిక్‌గా నిలిచారు.

అంద‌రి ముందు అలా హీరోయిన్‌కి ముద్దు పెట్ట‌డంతో దారుణంగా ట్రోల్ న‌డిచింది.  దానిపై స్పందించిన ర‌వికుమార్.. అసలు హీరోయిన్ కి లేని నొప్పి మీకేంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఆమెను ఏమైనా కసిగా ముద్దు పెట్టుకున్నానా? నా కూతురుని కూడా అలాగే ముద్దు పెట్టుకున్నాను. నేను ఆమెను ఆప్యాయతగా ముద్దు పెట్టుకున్నాను. అయినా మన్నారాకి లేని నొప్పి, నా భార్యకు లేని నొప్పి మీకెందుకు. నా సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. అందుకే ఆమెను అలా ముద్దు పెట్టుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా హీరో గోపీచంద్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.   తాను హిట్స్ ఇచ్చిన హీరోలే తనని పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు.

కొంద‌రు హీరోల‌ని చూసి నాకు చాలా విసుగు క‌లుగుతుంది.  గతంలో మేము అందరం క‌లిసి చెట్టుకింద కూర్చుని భోజనం చేసే వాళ్ళం. కాని  ఇప్పుడు వీళ్ళని కలవాలంటే ఐదారుగురుని దాటుకుని వెళ్లాల్సివస్తోంది అంటూ ఇన్‌డైరెక్ట్‌గా  గోపీచంద్ పై ఫైర్ అయ్యారు. నా బర్త్ డే రోజు వచ్చావ్..నేను దగ్గినా తుమ్మినా నా ఇంటికి వచ్చావ్ అలాంటిది నేను నిన్ను కలవాలంటే ఐదుగురిని దాటుకుని రావాలా. వాడొక హీరోనా.. వాడు విలన్ అయితే నేనే హీరోని చేశా. మరి ఇప్పుడు అంత బలుపు దేనికి. వాడు ఎదురుపడితే కూడా ఇలాగే మాట్లాడతాను అంటూ రవికుమార్ చౌదరి పరోక్షంగా గోపిచంద్‌పై  తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, యజ్ఞం సినిమాతో ఏఎస్ రవికుమార్ కు, గోపిచంద్‌కి మంచి హిట్ ద‌క్కింది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...