Home Film News Sitara: తండ్రిని మించిన త‌న‌య‌.. మ‌హేష్ బాబుకి ద‌క్క‌ని గుర్తింపు తెచ్చుకున్న సితార‌
Film News

Sitara: తండ్రిని మించిన త‌న‌య‌.. మ‌హేష్ బాబుకి ద‌క్క‌ని గుర్తింపు తెచ్చుకున్న సితార‌

Sitara: కృష్ణ తండ్రి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్న మ‌హేష్ బాబు ఆయ‌న వార‌సుడిగా ఇండ‌స్ట్రీలో మంచి పేరు  ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయ‌న చేసే సినిమాల‌పై అంచనాలు మాములుగా లేవు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం చేస్తున్నమ‌హేష్ బాబు త్వ‌ర‌లో రాజ‌మౌళితో ఓ సినిమా చేయ‌నున్నాడు. అయితే మ‌హేష్ క‌న్నా ఇటీవలి కాలంలో ఆయ‌న కూతురు సితార‌కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ చిన్నారికి ఇన్‌స్టాలో   ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇటీవల ‘సారంగదరియా’ పాటకు డ్యాన్స్‌ చేసి  అద‌ర‌హో అనిపించింది.

ఇక ప్ర‌స్తుతం  పీఎంజే జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సితార వ్యవహరిస్తోంది. సితార చేస్తున్న తొలి యాడ్‌ను మూడు రోజులు షూట్‌ చేశారని టాక్. సినిమాలు, ప‌లు యాడ్స్ తో అల‌రిస్తున్న సితార‌…తొలి క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌తో అరుదైన గుర్తింపు తెచ్చుకుంది.   ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ఆమె తొలి క‌మ‌ర్షియల్ యాడ్‌ని  ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో  తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. లిటిల్‌ ప్రిన్సెస్‌ యాడ్‌ను టైమ్‌ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ అభిమానులు ఆనందోత్సాహం చెందుతున్నారు.

మ‌హేష్ బాబుకి ద‌క్క‌ని ఈ అరుదైన గౌర‌వం ప‌ట్ల ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తి చేస్తున్నారు. స్టార్‌ కిడ్స్‌లో అతి చిన్నవయసులో సితారకు దక్కిన గౌరవమిదని అభిమానులు సోషల్‌ మీడియాలో నానా ర‌చ్చ చేస్తున్నారు.. మంగళవారం (4, జూలై) అమెరికా ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా తమ అభిమాన హీరో గారాల బిడ్డను టైమ్‌స్వ్కేర్‌లో చూడడం గర్వంగా ఉందని అభిమానులు ర‌చ్చచేస్తున్నారు.  అతి చిన్న వయసులో కమర్షియల్‌ యాడ్‌ స్టార్‌ కిడ్స్‌గా సితార గుర్తింపు పొంద‌డం ప‌ట్ల ఈ విష‌యం ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇక మ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు..  తన కొత్త ప్రాజెక్ట్ “గుంటూరు కారం” లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మ‌హేష్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదం పంచ‌నున్నార‌ని తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...