Home Film News Baby Second Hero: బేబి సెకండ్ హీరో తండ్రి ఇస్రోలో ప‌ని చేస్తారా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక‌వుతారు..!
Film News

Baby Second Hero: బేబి సెకండ్ హీరో తండ్రి ఇస్రోలో ప‌ని చేస్తారా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక‌వుతారు..!

Baby Second Hero: సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బేబి సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాకి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టికీ ఈ మూవీ మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల బ్రో సినిమా తీసేసి మ‌రీ బేబి సినిమాని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే బేబి మూవీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మార‌గా ఈ సినిమాలో న‌టించిన ప్ర‌ధాన పాత్ర‌ధారుల గురించి అంద‌రు ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. ఆనంద్ దేవ‌ర‌కొండ అంటే విజ‌య్ సోద‌రుడు అని అంద‌రికి తెలుసు. వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా తెలిసిందే.ఇక బేబి హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య ఎవ‌రు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంట‌నేదానిపై కూడా  ఇటీవ‌ల చాలా వార్త‌లు వచ్చాయి.

ఇక విరాజ్ అశ్విన్ విష‌యం చూస్తే.. బేబీ సినిమా క‌న్నా ముందే అనగనగా ఓ ప్రేమ కథ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు . ఆయ‌న ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించాడు. అయితే ఆ చిత్రం అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా  తరువాత అనసూయతో కలిసి థాంక్యూ బ్రదర్ అనే చిత్రంలో నటించాడు విరాజ్. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే విడుదలై పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకోలేక‌పోయింది. అనంత‌రం   మనసానమ: అనే షార్ట్ ఫిలింలో కూడా నటించాడు. దాదాపు 16 నిమిషాలు నిడివి ఉన్న ఈ ల‌ఘు చిత్రం ప్ర‌భంజ‌న‌మే సృష్టించింది.

గ‌త ఏడాది రిలీజ్ అయిన   ఈ షార్ట్ ఫిలింకి 513 అంతర్జాతీయ అవార్డు రావడం విశేషం.  ఈ షార్ట్ ఫిలిం తరువాత విరాజ్  హీరోగా  మాయపేటిక మూవీ రూపొంద‌గా, ఈ చిత్రం  విడుదలై డిజాస్టర్ అయింది. అయితే ఇలా వ‌రుస ఫ్లాపుల‌తో ఆయ‌న కెరీర్ అగమ్య‌గోచ‌రంగా మారిన స‌మ‌యంలో విరాజ్‌కి బేబి రూపంలో మంచి హిట్ పడింది. దీంతో మ‌నోడి గురించి అంద‌రు ఆరాలు తీస్తున్నారు.విరాజ్ అశ్విన్ తండ్రి ఫాదర్ ఇస్రో సంస్థలో పని చేస్తారట. త‌మ‌ది ఎబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పిన విరాజ్, త‌న తండ్రి  బాగా చదువుకోవాలని సూచించారని తనలా గొప్ప సైంటిస్ట్ కావాలని కోరారని అన్నారు. తాను రిచ్ లైఫ్ ఏనాడు చూడలేదు, నా బాల‌య్యం అంతా ఇస్రో ఫ్యామిలీస్ ఉన్న టౌన్‌షిప్‌లో న‌డిచింద‌ని విరాజ్ అన్నారు. నా లుక్స్ చూసి చాలా మంది రిచ్ అనుకుంటారు.  రాకెట్ లాంఛింగ్ నేను చాలాసార్లు చూశానని విరాజ్ చెప్పుకొచ్చారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...