Nandamuri Heroes
Nandamuri Heroes: మొత్తానికి నందమూరి ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఆశించినట్లు ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ అయ్యింది. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. ఫస్ట్ సినిమా అయినా డైరెక్టర్ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ‘బింబిసార’ ని ఓ విజువల్ వండర్‌గా తెరకెక్కించాడని.. ఈమధ్య సందడి తగ్గిపోయింది కానీ మళ్లీ జనాల్ని థియేటర్లకు రప్పించేది ‘బింబిసార’ మూవీనే అని ఫిక్స్ అయిపోయారు.
2021 డిసెంబర్ 2 నుండి 2022 ఆగస్టు 5 వరకు అంటే 9 నెలల గ్యాప్‌లో నందమూరి బాబాయ్ – అబ్బాయ్‌లు మూడు సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేశారు. ‘అఖండ’ పాండమిక్ తర్వాత భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఇక ‘ఆర్ఆర్ఆర్ తో తారక్ ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ వంతు వచ్చింది. ‘బింబిసార’ తో బాక్సాఫీస్ దండయాత్ర మొదలు పెట్టాడు.
ఈ మూడు సినిమాల్లోనూ ఓ విషయంలో పోలిక కుదిరింది. అదేంటంటే.. ఛైల్డ్ సెంటిమెంట్.. ‘అఖండ’ లో సెకండ్ బాలకృష్ణ కూతురికి అఘోరా క్యారెక్టర్‌కి మధ్య ఎంత బాడింగ్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. పాపను సేవ్ చెయ్యడంతో ఎంటర్ అయిన అఘోరా క్యారెక్టర్.. చివరి వరకు పాపతో ఉంటుంది.
అలాగే ‘ఆర్ఆర్ఆర్’ లో మల్లి రోల్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. ‘కొమ్మా ఉయ్యాలో’ పాటను ఎంత అద్భుతంగా పాడుతుందో చూశాం.. భీమ్‌ని మల్లి అన్న అని పిలుస్తుంటుంది. తెల్లవాళ్ల దగ్గర బందీగా ఉన్న చెల్లిని విడిపించడానికి భీమ్ ఎలాంటి సాహసాలు చేస్తాడో తెలిసిందే. కథలో కీలకమైన క్యారెక్టర్ మల్లి..
ఈ సినిమాల్లోలానే ‘బింబిసార’ లోనూ ఛైల్డ్ సెంటిమెంట్ ఉంది. విశేషం ఏంటంటే ‘అఖండ’, ‘ఆర్ఆర్ఆర్’ లానే ఇందులోనూ ఛైల్డ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది.. కథలో కీలకంగా కనిపించే చిన్నారి క్యారెక్టర్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ పాప పేరు శ్రీదేవి. ఇంతకంటే వివరంగా చెప్తే థ్రిల్ ఉండదు. కాబట్టి థియేటర్లలో ‘బింబిసార’ చూసి తెలుసుకోండి.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.