Home Film News NBK 107 : ‘గాలి వాలుతో దాహమూ తీరుస్తాడు – దహణమూ చేస్తాడు’.. డైలాగ్ అదిరిందిగా..
Film News

NBK 107 : ‘గాలి వాలుతో దాహమూ తీరుస్తాడు – దహణమూ చేస్తాడు’.. డైలాగ్ అదిరిందిగా..

NBK 107
NBK 107

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కర్నూలు షెడ్యూల్ కంప్లీట్ చేశారు టీం.

బాలయ్య పక్కన ఫస్ట్ టైమ్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. పాపులర్ మలయాళీ యాక్టర్ లాల్, యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

NBK 107కి ‘రెడ్డి గారు’, ‘అన్నగారు’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. త్వరలో పేరు ప్రకటించే అవకాశముంది. రీసెంట్‌గా రైటర్ కళ్యాణ్ చక్రవర్తి ట్విట్టర్‌లో NBK 107 గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈయన ‘అఖండ’ లో సాంగ్స్ రాశారు. ప్రస్తుతం పలు సినిమాలకు పాటలు, కథ, మాటలు రాస్తూ బిజీగా ఉన్నారు.

బాలయ్య ఫోటోతో ‘‘పరుచుకున్న నేలకి కప్పుకున్న ఆకాశానికి మధ్య నీరూ – నిప్పు – గాలి మూడూ వాడే…. గాలి వాలుతో దాహమూ తీరుస్తాడు – దహణమూ చేస్తాడు’’ అనే పవర్ ఫుల్ డైలాగ్ షేర్ చేశారు. అయితే ఈ మూవీకి సాయి మాధవ్ బుర్రా రైటర్.. కళ్యాణ్ కూడా వర్క్ చేస్తున్నారా?.. ఈ డైలాగ్ బాలయ్య-గోపిచంద్ సినిమాలోదా?.. లేక తర్వాత సినిమాలోదా?.. స్వతాహా బాలయ్య అభిమాని, పైగా రచయిత కావడంతో ఆయన తన ఓన్ డైలాగ్‌ని ఇలా పోస్ట్ చేశారా? అనేది క్లారిటీగా తెలీదు. NBK 107లో నటసింహా రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టైటిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఈ డైలాగుతో ఫుల్ కిక్కిచ్చారు కళ్యాణ్ చక్రవర్తి..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...