Jr NTR T Shirt
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ బయటెక్కడా కనిపించలేదు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ.. అన్నయ్య కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఛీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.
ఫంక్షన్‌లో ఎన్టీఆరే మెయిన్ హైలెట్ అయ్యాడు. అన్నదమ్మళ్లిద్దర్నీ పక్కపక్కన చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక సినిమా గురించి, అన్నయ్య పడ్డ కష్టం గురించి తారక్ మాట్లాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో తారక్ బాగున్నాడు.
తను వేసుకున్న టీ షర్ట్ గురించి ఫ్యాన్స్ నెట్టింట సెర్చ్ చేశారు. గతంలో తారక్ షూస్, మాస్క్ కాస్ట్ గురించి కూడా న్యూస్ బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ పాపులర్ బ్రాండ్ Karl Lagerfeld Paris Sweatshirt ధరించాడు. దీని కాస్ట్ ఎంతో తెలుసా?
Karl Lagerfeld Paris 21 Rue St-Guillaume స్వెట్ షర్ట్ ధర 23 వేల నుండి 30 వేల మధ్యలో ఉంది. దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవడమేకాక.. తారక్ టీ షర్ట్ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో, టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో, కొత్త కుర్రాడు మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేసిన ‘బింబిసార’ ఆగస్టు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవబోతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా ఇది. అన్నయ్య కళ్యాణ్ రామ్, కొరటాల ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలినేని కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తారక్ బర్త్‌డేకి వదిలిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 31వ మూవీని ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు. కళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.