Home Film News Lavanya Tripathi: లిప్ లాక్ ఇష్టం లేక బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా మిస్ చేసుకున్న లావ‌ణ్య త్రిపాఠి
Film News

Lavanya Tripathi: లిప్ లాక్ ఇష్టం లేక బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా మిస్ చేసుకున్న లావ‌ణ్య త్రిపాఠి

Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల భామ లావ‌ణ్య త్రిపాఠి. ఈ అమ్మ‌డి పేరు ఎప్పుడో ఒక‌సారి వార్త‌ల‌లో వినిపించేది. కాని ఎప్పుడైతే మెగా కోడ‌లి ప్ర‌మోష‌న్ అందుకుందో అప్ప‌టి నుండి లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. నిత్యం లావ‌ణ్య త్రిపాఠికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉంది. తాజాగా లావ‌ణ్య త్రిపాఠి ఒక బ్లాస్ బ‌స్ట‌ర్ మూవీని లిప్ లాక్ సీన్ చేయ‌డం ఇష్టం లేక మిస్ చేసుకుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ అమ్మ‌డు చేసిన ప్ర‌తి సినిమాలో కూడా హ‌ద్దులు దాట‌కుండానే న‌టించింది.

లావణ్య త్రిపాఠి కెరీర్ లో చూస్తే ఆమె ఇప్పటి వరకూ ఏసినిమాలోకూడా బెడ్ సీన్స్ కాని.. లిప్ లాక్ లు కాని చేసింది లేదు.  అలాంటి సినిమాలు లావణ్య త్రిపాఠిని ప‌ల‌క‌రించిన కూడా సింపుల్‌గా నో చెప్పేసింద‌ట‌. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల భామ‌ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన  గీత గోవిందం ఎంత పెద్ద హిట్ అయింతో తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా బదులు లావణ్య త్రిపాఠిని అనుకున్నార‌ట‌. ముందుగా మేక‌ర్స్ ఆమెనే అప్రోచ్ అయ్యార‌ట‌. అయితే ఇందులో  లిప్ లాక్ సీన్స్  స‌న్నివేశాల గురించి చెప్ప‌గా, వాటిని తీసేయమని అడిగిందట లావణ్య. అయితే అదే  సినిమాకు బలం.. అవి తీయ‌డం కుద‌ర‌ద‌ని చెప్ప‌డంతో లావ‌ణ్య‌ మూవీ నుంచి తప్పుకుందట.

ఆ సినిమా క‌నుకు ఒప్పుకొని ఉంటే లావణ్య త్రిపాఠి.. ర‌ష్మిక మాదిరి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యేది. ఇక లావ‌ణ్య త్రిపాఠి జూన్ 9న వ‌రుణ్ తేజ్ తో నిశ్చితార్థం జ‌రుపుకుంది. నాగబాబు ఇంట్లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుక‌కి కొద్ది మంది బందువులు , మెగా.. అల్లు ఫ్యామిలీల మాత్రమే హాజ‌ర‌య్యారు.ఈ ఏడాది చివ‌ర‌లో వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుంద‌నే టాక్ వినిపిస్తుంది. లావ‌ణ్య త్రిపాఠి  చివ‌రిగా  పులి మేక అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు  వ‌చ్చింది..

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...