Home Film News Lavanya Tripathi: త‌ప్పుడు ప్ర‌చారంపై ఫుల్ సీరియ‌స్ అయిన లావ‌ణ్య త్రిపాఠి..!
Film News

Lavanya Tripathi: త‌ప్పుడు ప్ర‌చారంపై ఫుల్ సీరియ‌స్ అయిన లావ‌ణ్య త్రిపాఠి..!

Lavanya Tripathi: అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యమైన అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించిన ఈ భామ ఇప్పుడు మెగా కోడ‌లు  అయింది. వ‌రుణ్ తేజ్‌తో ఇటీవ‌ల లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం కాగా, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే వ‌రుణ్ తేజ్ తో నిశ్చితార్థం త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది.. రీసెంట్‌గా ఈ భామ‌పై త‌ప్పుడు పుకార్లు పుట్టించారు. దాంతో సీరియ‌స్ అయింది. లావ‌ణ్య త్రిపాఠి రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో త‌న‌రే  ట్రిపోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
an
ట్రిపోఫోబియా వ్యాధి వ‌చ్చిన వారు  ఏదైన వింత ఆకారాలను, వింత వస్తువులు, రంధ్రాలు ఉన్న, గడ్డలు కట్టిన వస్తువులను చూసి భయపడటం చేస్తారు.  వింత ఆకరాలను చూసిన‌ప్పుడు ఎవ‌రికైన భ‌యం వేస్తుంది. కాని  లావణ్య కాస్త ఎక్కువగా భయపడతారట. రెండేళ్ల క్రితం  లావణ్య త్రిపాఠి చెప్పిన‌ మాటలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో వాటిపై స్పందించిన లావ‌ణ్య త్రిపాఠి.. “నాకు వింత వ్యాధి ఉందా.. నాకు తెలిసినంత వరకు నేను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు నేను మిమ్మల్ని ఏం చేయాలి, దీని వ‌ల‌న మీకే ఏం లాభం అని ఫైర్ అయిన‌ట్టు తెలుస్తుంది.

అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి తమిళంలో అధర్వ మురళికి జోడీగా ఓ సినిమా చేస్తోంది. ఇక‌ తెలుగులో రెండు వెబ్ సిరీస్ లు కూడా లైన్ లో పెట్టిన‌ట్టు స‌మాచారం.. పులిమేక వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు వెబ్ సిరీస్‌ల‌పై కూడా చాలానే ఆస‌క్తి చూపిస్తుంది. సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది లావ‌ణ్య‌.  త‌ర‌చు హాట్ ఫొటోలతో నెటిజన్లకి పిచ్చెక్కించే లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తర్వాత  కూడా కాస్త  హాట్‌గానే క‌నిపిస్తుంది. ఇటీవ‌ల  తాను   వైట్ డ్రెస్ ధరించి లవ్ షేప్ ఉన్న బెంచ్ పై కూర్చున్న త‌న థైస్ అందాలు చూపించి నెట్టిజన్స్‌కి పిచ్చెక్కించింది.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...