Home Film News Varun Tej: తొలిసారి త‌న ల‌వ్‌పై స్పందించిన వ‌రుణ్ తేజ్.. ముందుగా ఎవ‌రు స్పందించారంటే..!
Film News

Varun Tej: తొలిసారి త‌న ల‌వ్‌పై స్పందించిన వ‌రుణ్ తేజ్.. ముందుగా ఎవ‌రు స్పందించారంటే..!

Varun Tej: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కొద్ది రోజుల క్రితం పెద్ద షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆరేడేళ్ల‌గా లావ‌ణ్య త్రిపాఠితో సీక్రెట్ ప్రేమాయ‌ణం న‌డిపిన వ‌రుణ్‌.. జూన్ 9న సైలెంట్‌గా ఆమెతో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు.  చాలా సింపుల్‌గా వీరి నిశ్చితార్థ వేడుక జ‌రిగింది. ఇక పెళ్లెప్పుడు జ‌రుగుతుంది అనే దానిపై కొన్నాళ్లుగా అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు . ప్ర‌స్తుతం మెగా ప్రిన్స్  వ‌రుణ్ తేజ్ తన తాజా చిత్రం గాండీవధారి అర్జున ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు.  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.  బీఏవీఎన్ఎస్ ప్రసాద్ నిర్మించిన  ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఆగస్టు 25వ తేదీన  ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి.

అయితే గాండీవధారి అర్జున చిత్ర ప్రమోషన్స్ మొద‌లు పెట్టిన వరుణ్ తేజ్ ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన విష‌యాల‌తో పాటు  లావ‌ణ్య త్రిపాఠితో ల‌వ్ గురించి కూడా ఓపెన్ అయ్యాడు. త‌మ ల‌వ్ స్టోరీ మొద‌లై 5 ఏళ్లు దాటిపోయిందని చెప్పిన వ‌రుణ్ తేజ్… తామిద్ద‌రం ప్రేమ‌లో ప‌డ‌టానికి ముఖ్య‌మైన‌ కారణం మా అభిప్రాయాలు క‌ల‌వ‌డ‌మేనని  అన్నారు.. తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో లావణ్య త్రిపాఠి ఒక‌రు కాగా,తాను నాపై చాలా కేరింగ్ చూపిస్తుంద‌ని తెలియ‌జేశాడు. ఇక త‌నకు నేనే ప్ర‌పోజ్ చేశాన‌ని కూడా పేర్కొన్నాడు.

ఇంట్లో మా ఇద్ద‌రి ప్రేమ గురించి చెప్ప‌గానే  వారు కూడా ఒప్పుకున్నారు . నా ప‌ర్స‌న‌ల్ విష‌యాలు ఎప్పుడు కూడా  సీక్రెట్ గా ఉంచ‌డానికే ట్రై చేస్తాను. అందుకే ఈ విష‌యం ఎక్క‌డ చెప్ప‌లేదు. తాను చాలా మెచ్యూర్డ్ ప‌ర్స‌న్. నాకు ఏం కావాలో త‌న‌కి చాలా బాగా తెలుసు. ఇప్ప‌టి వ‌రకు నాకు ఎన్నో బ‌హుమ‌తులు ఇచ్చింది. తాను వాడుతున్న ఐ ఫోన్ కూడా తాను ఇచ్చిందేన‌ని వ‌రుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక నా నిర్ణయాన్ని మా ఇంట్లో  వాళ్లు చాలా  నమ్ముతారు. లావణ్య ఇంట్లో కూడా తనను బాగా నమ్ముతారు. చాలా చిన్న వయసులోనే తను ఇంట్లోంచి బయటకొచ్చి వృత్తి రీత్యా చాలా క‌ష్ట‌ప‌డింది అని వ‌రుణ్ చెప్పుకొచ్చాడు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...