Home Film News భారీ రేటుకు సలార్ తొలి టికెట్ కొన్న జ‌క్క‌న్న‌… ధర ఎంతో తెలుసా..?
Film News

భారీ రేటుకు సలార్ తొలి టికెట్ కొన్న జ‌క్క‌న్న‌… ధర ఎంతో తెలుసా..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తుంది స‌లార్‌. ఈరోజు నుంచి సరిగ్గా మరో ఆరురోజుల్లో ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికిె రెడీగా ఉంది.. ప్రభాస్ అభిమానులు కూడా సలార్ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ సినిమా కాబట్టి కలక్షన్లు కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నాయి.

SS Rajamouli: రాజమౌళి నెక్ట్స్.. 'PPP' | SS Rajamouli Will Interview Salaar Team Prabhas Prashanth Neel And Prithviraj srk

ఇక ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వటంతో సలార్ టిక్కెట్స్ కోసం అభిమానులు ఎంతో హంగామా చేస్తున్నారు. అయితే సలార్ ఫాస్ట్ టికెట్ మాత్రం ఎవరు ఊహించిన వ్యక్తి చేతికి వెళ్ళింది. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు దర్శక ధీరుడు రాజమౌళి సలార్ మూవీ యూనిట్ తో చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్, ప్రశాంత్ నీల్‌, పృధ్విరాజ్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇద్దరూ సెన్సేషనల్ దర్శకులు కలిసి చేసిన పాన్ ఇండియా ఇంటర్వ్యూ ఆడియన్స్ ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలో స‌లార్ ఫస్ట్ టికెట్‌ని రాజమౌళి తీసుకున్నాడు.ఇక దాదాపు 10వేలు ఖర్చుపెట్టి మరి ఫస్ట్ టికెట్ని రాజమౌళి దక్కించుకున్నాడు. ఈనెల 22న ఉదయం 7 గంటల షోకి సంధ్య థియేటర్ టికెట్ ని రాజమౌళికి ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీ, మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కలిసి అందించారు.

Rajamouli Buys First Ticket Of Salaar

రాజమౌళికి ప్రభాస్‌కి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వడం వెనక కూడా రాజమౌళి సపోర్ట్ ఎంతో ఉంది. కే జి ఎఫ్ పార్ట్1 సినిమాని అందరికీ రీచ్ అయ్యెలా చేసింది రాజమౌళి చేసిన ఒక ట్వీట్‌.. అదే విధంగా అ సినిమా ఫ్రీరీలిజ్‌ ఈవెంట్ కి కూడా వెళ్లి మరీ కే జి ఎఫ్ సినిమాని ప్రమోట్ చేసిన రాజామౌళి.. ఇప్పుడు మరోసారి స‌లార్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు.. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, ప్రశాంత్ నీల్, రాజమౌళి, పృథ్వీరాజ్ ఎలాంటి హంగామా చేశారు అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...