Home Film News DASARA : నాని ‘దసరా’ అప్‌డేట్ ఏంటంటే..
Film News

DASARA : నాని ‘దసరా’ అప్‌డేట్ ఏంటంటే..

DASARA
DASARA

DASARA : కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఎప్పుడూ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు నేచురల్ స్టార్ నాని.. సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్ పరంగా వెవిధ్యం చూపించాలనుకునే నాని ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలతో నటుడిగా మరింత పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు కంప్లీట్ మాస్ అవతార్‌లో ‘దసరా’ మూవీ చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. SLV సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు టీం.

తెలంగాణ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘దసరా’ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందని.. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని యూనిట్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం : సంతోష్ నారాయణన్, కెమెరా : సత్యన్ సూర్యన్, ఎడిటింగ్ : నవీన్ నూలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...