Home Film News Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌
Film News

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్నాడు. ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. అభిమానులు కూడా ప‌వ‌న్ బ‌ర్త్ డేని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. పొలిటికల్ గా కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సిద్దం అవుతున్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి పోస్టర్లు కూడా వరుసగా రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి జోష్ అందిస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా నుంచి.. వీరుడి గెటప్ లో పవర్ స్టార పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. అర్ధరాత్రి 12:17 నిమిషాలకు ఈ సినిమా నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

 

ఈ పోస్ట‌ర్ అనేక రూమ‌ర్స్‌కి చెక్ పెట్టింది. ఈసినిమా ఆగిపోలేదని.. షూటింగ్ కాస్త లేట్ అవ్వచ్చేమో కాని.. ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నట్టుగా హింట్ ను ఇచ్చేశారు. ఇకపోతే సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్ ఓ చిన్న బర్త్ డే నోట్ కూడా రాశారు. ఈ సంతోషకరమైన రోజున, మన హరిహరవీరమల్లు యొక్క అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణను జరుపుకుంటున్నాము అని అందులో రాసి ఉంది. పోస్ట‌ర్‌లో పవన్ ను ఒక యోధుడిగా చూపించారు. ఇప్పటి వరకూ కోర మీసాలు, క్లీన్ షేవ్ తో కనిపించిన వీరమల్లు.. ఇందులో మాత్రం గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్‌కి మంచి జోష్ అందిస్తున్నాడు.

చిత్రంలో ప‌వన్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొంద‌గా, ఈసినిమాలో కన్నడ భామ.. ఇస్మార్ట్ బ్యూటీ నిథి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. . ఈసినిమా షూటింగ్ పై గతంలో రకరకాల రూమర్లు వినిపించాయి. క్రిష్ పై అసంతృప్తితో ఉన్న పవర్ స్టార్ ఈసినిమాను పక్కన పెట్టారని చాలా కాలం ప్రచారం జరిగింది. అయితే తాజా పోస్ట‌ర్ మాత్రం అన్నింటికి చెక్ పెట్టిన‌ట్టు అయింది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...