Home Film News Chiranjeevi: ఆడపిల్లలను అలా చూడొద్దు అన్నా కూడా దరిద్రంగా అలాగే చూస్తాడు: చిరంజీవి
Film News

Chiranjeevi: ఆడపిల్లలను అలా చూడొద్దు అన్నా కూడా దరిద్రంగా అలాగే చూస్తాడు: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌ల కానుండ‌గా, మూవీపై బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. చిత్రంపై కూడా అంచ‌నాలు మ‌రింత పెంచేలా మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. చిత్ర రిలీజ్‌కి మరికొన్ని గంటలు స‌మయం మాత్రమే మిగిలి ఉండ‌గా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక చిరంజీవి ఈ చిత్రంలో క్యాబ్ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచ‌రం. గ‌తంలో ఆయ‌న గ్యాంగ్ లీడర్, ఇంద్ర తదితర సినిమాల్లో క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించి మెప్పించ‌గా, ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నారు..

ఇటీవ‌ల చిరంజీవి త‌న టీంతో క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.ఆ ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేశ్‌తో పాటు మూవీలో లీడ్ రోల్స్ చేసిన తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, రాజా రవీంద్ర, యాంకర్ శ్రీముఖి, గెటప్ శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు. అయితే శ్రీముఖి ఒక్కొక్క‌రి గురించి చిరంజీవిని అడుగుతున్న నేప‌థ్యంలో రాజా రవీంద్ర గురించి చెప్పాలని కోరింది. అప్పుడు ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. ఆయ‌న నోటిదూల గాడు. మనసులో ఏం ఉండదు. బయటకు మాత్రం ఏదో ఒకటి వాగి, దొబ్బులు తింటుంటాడు. నన్ను చూస్తే చూశావయ్యా, ఆడపిల్లలను చూడకు. అంటే దరిద్రంగా అలాగే చూస్తాడు అని రాజా ర‌వీంద్ర గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

 

ఇక చిరు చేసిన ఫ‌న్నీ కామెంట్ ఇప్పుడు నెట్టింట తెగవైర‌ల్ అవుతుంది. మ‌రోవైపు చిరంజీవితో తనది చాలా లాంగ్ జర్నీ అని చెప్పిన రాజా ర‌వీంద్ర‌.. తాను అన్న‌య్య‌తో ఏ సినిమా చేసిన ఫస్ట్ డేలా ఉంటుంది అని అన్నారు. చాలాసార్లు తిట్లు కూడా తిన్న. నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నానా? అని అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను. అప్పుడు ఏంట్రా అలా చూస్తున్నావ్? చేతబడి చేసే వాడిలా ఆ చూపేంటి దరిద్రంగా. పో ఇక్కడి నుంచి అని అంటుంటారు అని రాజా ర‌వీంద్ర అన్నారు.ఇక భోళా శంక‌ర్ విష‌యానికి వ‌స్తే.. చిత్రంలో అన్నా చెల్లెలి సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంటుంద‌ని తెలిపాడు. యాక్షన్, డ్రామా సహా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయ‌ని నిర్మాతలు తెలియ‌జేశారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...