Home Film News Aamani: బ‌ట్ట‌లు విప్పి చూపించ‌మ‌న్నాడు.. సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని షాకింగ్ కామెంట్స్
Film News

Aamani: బ‌ట్ట‌లు విప్పి చూపించ‌మ‌న్నాడు.. సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని షాకింగ్ కామెంట్స్

Aamani: ఇటీవ‌ల కాస్టింగ్ కౌచ్ గురించి న‌టీమ‌ణులు, యాంక‌ర్స్ చెబుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. ఒక‌ప్పుడు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోల గురించి ఏదైన మాట్లాడాలి అంటే న‌టీమ‌ణులు భ‌య‌ప‌డేవారు. కాని ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ధైర్యంగా త‌మ కెరీర్‌లో ప‌డ్డ ఇబ్బందులు గురించి బ‌హిరంగంగా చెప్పుకొస్తున్నారు. రీసెంట్‌గా యాంక‌ర్ వ‌ర్షిణి త‌న‌ని ఒక ద‌ర్శ‌కుడు హోట‌ల్‌కి పిలిచి ఇబ్బంది పెట్టాడ‌ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక తాజాగా సీనియ‌ర్ న‌టి ఆమని కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. తాజా ఇంట‌ర్వ్యూలో ఆమ‌ని కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించింది.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే హీరోయిన్స్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్ర‌తి ఒక్క‌రు జాగ్రత్తగా ఉండాలి. ఓ సినిమాలో నేను హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ నా రూమ్ లోకి వచ్చి ఈ రోజు స్విమ్మింగ్ పూల్ షూట్ ఉంటుంది అన్నారు. అయితే నీ శరీరం మీద స్క్రాచ్ లు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయాలి డ్రెస్ తీసేయ్ అన్నారు. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. అలాంటి సీన్ లో నేను నటించను అని చెప్పేశాను. ఇంకోసారి మేనేజర్ వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియర్ చూడాట‌. ఒక‌సారి కారులో ఎక్క‌మ‌ని అడిగాడు.. అప్పుడు డైరెక్టర్, హీరో, నిర్మాత చూడాలి గానీ అతనెవరు అని నేను వెళ్లలేదు.

 

అప్పట్లో సెల్ ఫోన్లు కూడా ఉండేవి కాకపోవ‌డంతో… ఏదైనా సరే డైరెక్టుగా వెళ్లి కలవాల్సి వచ్చేది.కొన్నిసార్లు మా అమ్మ లేకుండా నన్ను ఒంటరిగా రమ్మని చెప్పేశారు.కొన్నిసార్లు నాకు అనుమానం వచ్చి నేను వెళ్లేదాన్ని కాదు. ఇలా నా కెరీర్‌లో ఎన్నో అనుభవాలను నేను చూశాను అంటూ చెప్పుకొచ్చింది ఆమ‌ని.సీనియ‌ర్ హీరోయిన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాని కూడా షేక్ చేస్తున్నాయి. ఇక ఆమ‌ని విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమ‌ని ప్రస్తుతం హీరోయిన్ లకు తల్లిగా , ఇత‌ర క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది. జంబలకిడిపంబ చిత్రం ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆమని… ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో..వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...