Home Film News Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్ రాజ‌కీయాల‌లోకి రాబోతున్నాడా.. ఆయ‌న ఏం చెప్పారంటే..!
Film News

Sai Dharam Tej: సాయి ధ‌ర‌మ్ తేజ్ రాజ‌కీయాల‌లోకి రాబోతున్నాడా.. ఆయ‌న ఏం చెప్పారంటే..!

Sai Dharam Tej: మ‌రి కొద్ది రోజుల‌లో ఎల‌క్ష‌న్స్ రానున్న నేప‌థ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయా పార్టీల‌లోకి వెళ్లేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇదే క్ర‌మంలో ప‌వన్ క‌ల్యాణ్ మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రాజ‌కీయాల‌లోకి వెళ్ల‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండగా, ఆయ‌న సింపుల్‌గా తేల్చేశాడు.  త‌న మామయ్య పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పాటు రాజకీయాల గురించి ప్ర‌స్తావ‌న రావ‌డంతో ఈ మెగా హీరో తెలివిగా స‌మాధానం ఇచ్చి ఎస్కేప్ అయ్యాడు. ప్ర‌స్తుతం  రాజకీయాలపై అంతగా అవగాహన లేదు.. అలాగే తాను పోటీ చేసే అవకాశం, ఆలోచన కూడా లేద‌ని త‌న మ‌న‌సులో మాట చెప్పాడు సాయిధ‌ర‌మ్ తేజ్.

ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా సినిమాల‌పైనే ఉందని, తాను త‌న మావ‌య్య‌తో క‌లిసి న‌టించిన బ్రో చిత్రం జూలై 2న విడుద‌ల కానుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక రీసెంట్‌గా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి వెళ్లి  శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు సాయి తేజ్ . ప్రత్యేక పూజలు చేసిన అనంత‌రం ఆయ‌న  కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.  వచ్చారు. మెగా హీరోతో సెల్ఫీలు దిగేందుకు మెగా ఫ్యాన్స్ పోటీపడ్డారు.  కడపలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను కూడా  సందర్శించారు. దర్గా ప్రతినిధులు ఆయనకు పూల మాల వేసి ఘనంగా స్వాగతం పల‌క‌డంతో పాటు  సంప్రదాయబద్ధమైన కాషాయ తలపాగాను ఆయ‌న‌కి ధరింపజేశారు.

అరగంట పాటు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్ అనంత‌రం త‌న అభిమానుల‌ని ప‌ల‌క‌రించారు. సాయి ధర‌మ్ తేజ్‌ని ప్ర‌త్య‌క్షంగా చూడ‌డంతో  అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. సాయి తేజ్‌తో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. ఇక అభిమానులు పెద్ద సంఖ్యలో అక్క‌డికి చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకోకుండా కడప పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.ఇక చివ‌రిగా సాయి ధ‌ర‌మ్ తేజ్ విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. ఈ సినిమా బుల్లితెర‌పై కూడా మంచి రేటింగ్ రాబ‌ట్టింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...