Home Film News Star Heroine: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. ఫుల్ ఎమోష‌న‌ల్ అవుతున్న హీరోయిన్
Film News

Star Heroine: ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. ఫుల్ ఎమోష‌న‌ల్ అవుతున్న హీరోయిన్

Star Heroine: ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చివ‌రిగా న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన భామ నిత్యా మీన‌న్. ఈ అమ్మ‌డు స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో స‌త్తా చాటింది. ఇటీవల పెద్ద‌గా అవకాశాలు రావ‌డం లేదు. చిన్న చిత‌కా సినిమాల‌లో న‌టిస్తూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇంట తీవ్ర‌ విషాదం నెలకుంది. తను ఎంతో ఇష్ట‌ప‌డే వ్య‌క్తి కన్నుమూయ‌డంతో  బాధని వ్యక్తం చేస్తూ నిత్యా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. నిత్యా ఇంట్లో ఇటీవ‌ల వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నిత్యా మీన‌న్  ఎంతగానో ప్రేమించే తన అమ్మమ్మ ఇప్పుడు చ‌నిపోగా, ఈమె కంటే ముందు నిత్యా తన తాతయ్యని కూడా కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగింది. త‌న‌కి న‌చ్చిన తాత‌య్య‌, అమ్మ‌మ్మ ఇద్ద‌రు కోల్పోవ‌డంతో నిత్యా మీన‌న్ విషాదంలో మునిగింది. తాజాగా నిత్యా మీన‌న్.. త‌న అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తూ.. “ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా” అంటూ త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఈ అమ్మ‌డి పోస్ట్‌కి నెటిజన్స్ స్పందిస్తున్నారు.   ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ధైర్యంగా ఉండాల‌ని చెబుతున్నారు.

ఇక ఇక నిత్యామీనన్ సినిమాల సంగ‌తి చూస్తే .. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తుండ‌గా,  పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది..  తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ లో జడ్జిగా కూడా చేస్తూ వస్తుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం నిత్యామీన‌న్‌కి తెలుగులో ఒక్క హిట్ లేదు. ఆమె తెలుగులో చేసిన `గుండె జారిగల్లంతయ్యిందే` , `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `రుద్రమదేవి`, `ఒక అమ్మాయి తప్ప`, `జనతా గ్యారేజ్‌`, `అ!`, `గీత గోవిందం`, `గమనం`, వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి..

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...