Home Special Looks ‘జానీ లీవర్’ బాలీవుడ్ ఫేమస్ కమెడియన్ మన తెలుగువాడు!
Special Looks

‘జానీ లీవర్’ బాలీవుడ్ ఫేమస్ కమెడియన్ మన తెలుగువాడు!

Johnny Lever Telugu Background

మనకి పెద్దగా తెలియని జానీ లీవర్ మన తెలుగువాడే. ఏకంగా బాలీవుడ్ లో గొప్ప నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఆయన ఒక తెలుగు క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వాడు. మాతృ భాష తెలుగే అయినా, చిన్నప్పుడే ముంబై లోని ధారావికి మారారు. హిందీ, మరాఠీ, ఇంగ్షీష్, తుళు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల జానీ లీవర్ ఎలా ఫేమస్ అయ్యారో చూద్దాం..

ఎన్నో కష్టాలు పడి..

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడో తరగతిలోనే చదువు మానేయాల్సి రావడంతో చిన్నప్పటినుంచే విపరీతమైన కష్టాలకి గురి కావాల్సి వచ్చింది జానీ. చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేవాడు. రోడ్ల మీద పెన్నులు అమ్ముకుంటూ, తనకి తెలిసిన బాలీవుడ్ నటుల డాన్స్ ని ఇమిటేట్ చేస్తూ జనాల్ని ఇంప్రెస్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఆ వచ్చిన డబ్బులతోనే తన కడుపు నింపుకునేవాడు.

ఆ పేరలా వచ్చింది..

తనకి నటనలో తనకి ప్రమేయం ఉందని తెలుసుకున్న రోజులు హైదరాబాద్ లోనే మొదలయ్యాయి. ముంబై వెళ్లకముందు ఓల్డ్ సిటీలో మొదటి సినిమాలకి హిందీ సినిమాలకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలు అతనికి బాగా నచ్చాయి. ఫేమస్ నటులని అనుకరించే ప్రయత్నం చేసేవాడు. అలా ఒకానొక రోజు తను పని చేస్తున్న కంపెనీలో ఇలా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే అతని స్నేహితులు జానీ లీవర్.. జానీ లీవర్ అని పిలవడం మొదలెట్టారు. ఆయన అసలు పేరు ‘ప్రకాష్ రావ్ జనుముల’ హిందుస్తాన్ యూనీలీవర్ కంపెనీలో ఆపరేటర్ గా పనిచేయడం వల్ల లీవర్ అనేది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినపుడు ఆ పేరుతోనే చెలామణి అవ్వడం మొదలెట్టాడు.

కెరీర్ ఇలా సాగింది..

జానీ లీవర్ మొదట్లో స్టాండ్ అప్ కమెడియన్ గా చేసేవాడు. కళ్యాణ్ జీ-ఆనంద్ జీ అనే ఇద్దరు సంగీత దర్శకుల తో చేరి ఈ షోలు చేసేవాడు. ఆ షోల ద్వారా మంచి పేరు, డబ్బు సంపాదించాడు జానీ. 1980 లలోనే వరల్డ్ టూర్ లు కూడా చేసాడు. వాటిల్లో చెప్పుకోదగ్గది.. 1982 లో అమితాబ్ బచ్చన్ తో కలిసి చేసిన టూర్. ఆ తర్వాత ‘హాసి కే హంగామే’ పేరుతో విడుదల చేసిన ఆడియో క్యాసెట్ బాగా పాపులర్ అయింది. ‘హోప్ 86’ పేరుతో ఒక చారిటీ షో కూడా చేసాడు జానీ. ఈ షోకి హాజరైన బాలీవుడ్ ప్రముఖులలో గుల్ ఆనంద్ కూడా ఉండడంతో ఆయన జానీలో ఉన్న టాలెంట్ ని చూసి ‘జల్వా’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఆయన మరింత ఫేమస్ అవడం మొదలైంది.

హిందీలో మాత్రమే కాదు.. పాపులర్ అవుతున్న కొద్దీ ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి. గుజరాతీ, కన్నడ, తుళు, మరాఠీ భాషల్లో నటించాడు. ఒకానొక తెలుగు సినిమాలో కూడా ఆయన కనిపించారు. ఆ సినిమా పేరే ‘క్రిమినల్’ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మహేష్ భట్. నాగార్జున మూవీ. ఇంకా జానీ లీవర్ ఒక తమిళ సినిమాలో కూడా కనిపించాడు. జానీ లీవర్ ఖాతాలో పలు అవార్డ్ లు ఉన్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...