Home Special Looks హీరో ఐన తండ్రి తాగుడుకి బానిసై చనిపోయినా సొంతంగా కష్టపడి పైకొచ్చిన ఐశ్వర్య రాజేష్!
Special Looks

హీరో ఐన తండ్రి తాగుడుకి బానిసై చనిపోయినా సొంతంగా కష్టపడి పైకొచ్చిన ఐశ్వర్య రాజేష్!

Aishwarya Rajesh Inspirational Background

సినీ నేపథ్యం :

అమర్నాథ్ అప్పటి తెలుగు సినిమాలో ఒక హీరో. తెలుగులో చాలా సినిమాల్లో నటించి, గొప్ప నటుడిగా పేరు గడించిన ఘనత ఆయనది. నిర్మాతగా సినిమాలు కూడా నిర్మించారు. ఆయన కొడుకు రాజేష్ కూడా హీరోగా నిరూపించుకున్నారు. మల్లె మొగ్గలు, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించారు. ఆయనకి తాగుడు ఒక వ్యసనంలా ఉండేది. ఐశ్వర్య మేనత్త సినీ అభిమానులకి బాగా సుపరిచితమైన వ్యక్తి. దాదాపు 500 సినిమాల్లో నటించిన ఆమె మంచి హాస్య నటిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. తెరమీద ఆమె నటనని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎందరో. అంతలా ఆమె ప్రేక్షకులని నవ్వించగలుగుతుంది.

తండ్రి మరణంతో కష్టాలు :

కానీ తన తండ్రి రాజేష్ కి ఉన్న మద్యపాన వ్యసనం వల్ల ఐశ్వర్యకి 8 ఏళ్లు ఉన్నప్పుడే చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం చెప్పలేని కష్టాల్లో కూరుకుపోయింది. రాజేష్ కి ఎక్కువగా దానాలు చేసే అలవాటు కూడా ఉండటంతో, ఎప్పుడూ ఆయన ఇంటికి ఎవరో ఒకరు వచ్చి ఆర్థిక సాయం అడిగేవాళ్ళట. ఎక్కువ సంపాదన లేకపోయినా.. ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు అనిపిస్తే వాళ్ళకి వెంటనే సహాయం చేసే ఆయన మనస్తత్వం చనిపోయే సమయానికి కుటుంబాన్ని పీకల్లోతు కష్టాల్లోకి తోసేసింది. ఉన్న కొద్ది పాటి ఆస్తిపాయి కూడా కొందరి కన్ను పడడంతో వాళ్ళు అద్దె ఇల్లు తీసుకుని జీవనం సాగించాల్సి వచ్చింది. ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు అన్నయ్యలని కూడా పోషించాల్సిన బాద్యత వాళ్ళ అమ్మపై పడింది. ఆమె ఎల్ఐసి ఏజెంట్ గా మారి పిల్లలని పోషించుకుంటూ, వాళ్ళకి మంచి చదువు అందేలా జాగ్రత్త పడింది. తల్లి కష్టాలన్నీ చూస్తూ పెరిగిన ఐశ్వర్య కూడా చిన్నప్పటినుంచే బాగా కష్టించి పనిచేయడం నేర్చుకుంది.

ఊహించని మరో ఘటన :

కాలం గడుస్తున్నకొద్దీ వాళ్ళ కుటుంబంలో మరో పెద్ద విషాదం నెలకొంది. ఐశ్వర్య ముగ్గురు అన్నయ్యల్లో ఇద్దరు చనిపోయారు. అప్పుడు వాళ్ళకి జీవితం మరింత కష్టమైపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అని ధైర్యంగా ఉండే సమయంలో ఇలా జరగడం తల్లికి మరింత దుఃఖాన్ని మిగిల్చింది. ఆమె మరేమీ చేయలేక మంచాన పడ్డారు. ఇక ఐశ్యర్య బాధ్యతలు తన తల మీద వేసుకోక తప్పలేదు. సీరియల్స్ లో అవకాశాల కోసం ప్రయత్నించింది. వచ్చిన చిన్న చిన్న అవకాశాల కోసం కూడా రాత్రింబవళ్ళు కష్టపడాల్సి వచ్చేది. అయినా అలాగే చేస్తూ ఉండటం ఆపలేదు. అలా చేస్తూనే సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నించింది. కానీ, సినిమాల్లో ప్రధాన హీరోయిన్ గా కనిపించడానికి ఆమె రంగు అడ్డుపడింది. కాస్త నల్లగా ఉండే ఆమెకి అవకాశాలు ఇవ్వకపోగా, ఆమె రంగుపై కామెంట్ చేసి అవమానించేవాళ్ళట. అయినా ఇవేవీ ఐశ్వర్యని ముందుకు వెళ్ళకుండా ఆపలేదు.

తమిళ సినిమాల్లో గట్టిగా ప్రయత్నించింది. 2010 లో అరంగేట్రం చేసి, అవకాశాలు దక్కించుకుంటూ తనని తాను నిరూపించుకోవడం మొదలుపెట్టింది. రెండు సైమా అవార్డ్ లతో పాటు, ఒక ఫిల్మ్ ఫేర్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది. 2017 లో మలయాళంలోకి, హిందీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమై తన సత్తా ఏంటో చాటుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ ‘వరల్డ్ క్లాస్ లవర్’ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా కనిపించింది ఐశ్వర్య. తను టీవీ యాంకర్ గా కూడా చేస్తుంది. కొన్ని తమిళ ప్రోగ్రామ్స్ కి ఇప్పటికే యాంకర్ గా అక్కడి జనాలకి సుపరిచితం.

సినీ నేపథ్యం ఉన్నప్పటికీ, తండ్రి, అన్నయ్యల అకాల మరణంతో కుంగిపోకుండా.. తల్లి పడిన కష్టాల నుంచి ఎంతో నేర్చుకుని జీవితంలో వేగంగా దూసుకుపోయిన ఐశ్వర్య ఎంతో స్పూర్తిదాయకం. తను ఇలాంటి కష్టాలు నిజ జీవితంలో ఎదుర్కుంది కాబట్టే.. కౌసల్యా కృష్ణమూర్తి వంటి సినిమాలో అంతబాగా నటించగలిగింది. ఆమెని ఇలా తీర్చి దిద్దిన ఆమె మదర్ కూడా చాలా మందికి స్పూర్తి దాయకం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...