Home Film News Bhola Shankar: ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తున్న భోళా శంక‌ర్ సాంగ్ ప్రోమో.. !
Film News

Bhola Shankar: ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తున్న భోళా శంక‌ర్ సాంగ్ ప్రోమో.. !

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇటీవ‌ల వాల్తేరు వీర‌య్య చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో భోళా శంక‌ర్ అనే చిత్రం చేస్తున్నాడు మెగాస్టార్ చిరు. దాదాపు పదేళ్ల తర్వాత డైరెక్టర్ మెహర్ రమేశ్ ఈ సినిమా కోసం మెగా ఫోన్ ప‌ట్టాడు. చిరుని ఈ ద‌ర్శ‌కుడు ఎలా తెర‌కెక్కిస్తాడా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. మూవీపై అయితే ఇప్పటికే అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో మరోసారి ట్యాక్సీ డ్రైవర్‏గా కనిపించి అల‌రించ‌నున్నారు చిరు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తుండ‌గా, ఈ చిత్ర షూటింగ్ గ‌త కొద్ది రోజులుగా కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫోటోస్ మూవీపై మ‌రింత ఆస‌క్తిని పెంచ‌గా, ఇక ఇప్పుడు ఈ సినిమా పాటల సందడిని మొద‌లు పెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేయ‌గా, ఇది ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పిస్తుంది. జూన్ 4న ఫుల్ సాంగ్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. అయితే ప్రోమోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు చిరు లుక్స్ ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండ‌గా, ఆయ‌న ఎలాంటి బీట్స్ అందిస్తాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

 

ఏకే ఎంటర్టైనమెట్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్.. కీర్తి సురేష్ భర్త పాత్రలో నటిస్తున్నాడు. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా, మూవీ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. కాగా, చిరంజీవి ఖైదీ నంబర్ 150తో సెకండ్ ఇన్నింగ్స్‌ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 2017 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకోగా, త‌ర్వాత వ‌చ్చిన చిత్రాలు అయితే కాస్త నిరాశ‌ప‌రిచాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...