Home Film News Avika Gor: ఏడు సార్లు పెళ్లి చేశారంటూ అవికా గోర్ ఇలా అనేసింది ఏంటి?
Film NewsGossips

Avika Gor: ఏడు సార్లు పెళ్లి చేశారంటూ అవికా గోర్ ఇలా అనేసింది ఏంటి?

Avika Gor: చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగువారికి ద‌గ్గ‌రైన అందాల భామ అవికా గోర్. ఈ భామ కాస్త పెద్దయ్యాక హీరోయిన్‌గా మారి వైవిధ్య‌మైన సినిమాలు చేసింది. ఉయ్యాల జంపాల చిత్రంలో రాజ్ తరుణ్ తో కలిసి చేసిన సందడి  వేరే లెవ‌ల్.  సినిమా చూపిస్తమావ , ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్స్‌ని కూడా అవికా గోర్ త‌న ఖాతాలో వేసుకుంది..ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగు, హిందీ, కన్నడలో వరుస సినిమాలు చేస్తోంది. త్వరలో అవికా చేసిన హిందీ చిత్రం 1920:  హార‌ర్స్ ఆఫ్ ది హార్ట్ అనే సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అవికా అనేక ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తుంది.

తాజాగా అవికా గోర్ త‌ను న‌టించిన ఓ సీరియ‌ల్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స‌సురాల్ సీమర్ కా అనే సీరియల్ లో సన్నివేశాలు త‌న‌ని చాలా ఇబ్బంది పెట్టాయ‌ని పేర్కొంది. ఆ సీరియ‌ల్‌లో  నాకు మొత్తంగా ఏడు సార్లు పెళ్లి చేశారు. మూడుసార్లు హీరోతో మరో నాలుగు సార్లు ఇతర క్యారెక్టర్స్ తో పెళ్లి  జ‌రిగింది. అంతేకాదు  మూడు సార్లు నేను చనిపోయి బ్రతికినట్లు కూడా చూపించారు. ఆత్మలతో మాట్లాడుతున్నట్లు చూపించారు. ఆ సీన్స్ తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుందని అవికా వెల్ల‌డించింది. ఇక  సౌత్ సినిమాలు చాలా కూడా  రీమేక్ చేస్తూ బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలను కాపీ కొడతారు అనే స్థాయికి తీసుకొచ్చార‌ని కామెంట్ చేసింది.

సౌత్ లో ముఖ్యంగా తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువే ఉంది అని పేర్కొంది అవికా. ప్రజలు కూడా దీన్ని బాగా హైప్ చేశారని ,చెప్పిన అవికా… తర్వాత ఇది తగ్గుతుంది అని అనుకుంటున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  ప్రస్తుతం అవికా తెలుగులో రెండు, ఒక హిందీ చిత్రం చేస్తూ బిజీగా ఉంది. 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ మూవీ జూన్ 23న విడుదల కానుండ‌గా,  ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది. ఇందులో ఈ అమ్మ‌డు త‌న పాత్ర‌తో అద‌ర‌గొట్ట‌నుంది. ఇక ఇదిలా ఉంటే  కొన్నాళ్ల క్రితం అవికా గోర్ ..మిలింద్ చాంద్వాని అనే వ్యక్తిని తన  ప్రేమికుడిగా పరిచయం చేసింది. దాదాపు రెండేళ్లుగా అతనితో రిలేషన్ లో ఉన్న ఈ అమ్మ‌డు అతనితో క‌లిసి త‌రచుగా ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...