Home Film News Pawan Kalyan : హీరోయిన్‌గా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కూతురు
Film News

Pawan Kalyan : హీరోయిన్‌గా ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కూతురు

Aishwarya Arjun
Aishwarya Arjun

Pawan Kalyan: ‘యాక్షన్ కింగ్’ అర్జున్.. కన్నడ, తెలుగు, తమిళ్‌లోనూ స్టార్ హీరో.. 150కి పైగా చిత్రాలు చేశారాయన. నటుడిగానే కాకుండా.. నిర్మాత, దర్శకుడిగానూ ప్రతిభ చాటుకున్నారు. ఇప్పుడు అర్జున్ తన పెద్ద కుమార్తె ఐశ్వర్యను తెలుగు ఇండస్ట్రీకి కథానాయికగా పరిచయం చేస్తున్నారు.

‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్’, ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. శ్రీ రామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ క్లాప్ నిచ్చాదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, రైటర్ సాయి మాధవ్ బుర్రా, మంచు విష్ణు, నటుడు షఫీ, నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హీరోగా విశ్వక్ సేన్‌కిది 11వ సినిమా కాగా.. ఐశ్వర్య ఇంతకుముందు 2013లో విశాల్ నటించిన తమిళ్ మూవీ Pattathu Yaanai తో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ మూవీ తెలుగులో ‘ధీరుడు’ పేరుతో విడదలైంది. తర్వాత తండ్రి దర్శకత్వంలో Prema Baraha (కన్నడ), Sollividava (తమిళ్) బైలింగ్వెల్ ఫిలిం చేసింది.

ఈ సినిమాలో అర్జున్ బెస్ట్ ఫ్రెండ్, సీనియర్ స్టార్ జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాపులర్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ భాషల్లోనూ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...