Home Film News యూఎస్ మార్కెట్లో ప్రీమియర్స్ తోనే దుమ్ము రేపుతున్న మహేష్..గుంటూరు కారంమా మజాకా..!?
Film News

యూఎస్ మార్కెట్లో ప్రీమియర్స్ తోనే దుమ్ము రేపుతున్న మహేష్..గుంటూరు కారంమా మజాకా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. తండ్రి కృష్ణ నట వారసుడిగా బాల నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత తండ్రిని మించిన స్టార్ హీరోగా ఎదిగీ సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. తాజాగా మహేష్ హీరోగా శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా గుంటూరు కారం.

ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ మూవీ మొదలైన దగ్గర్నుంచి మంచి బ‌జ్‌ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 12 అనగా రేపు గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు రానుంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా రికార్డు బుకింగ్స్ ను సెట్ చేసింది.

Image

ఇక యుఎస్ లో అయితే ఈ సినిమా రిలీజ్ కి ఒక్క రోజు మిగిలి ఉండగానే 1న్ మిలియన్ డాలర్ మార్క్‌ని దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కేవలం ప్రీమియర్ ష్సో తోనే రికార్డు స్థాయిలో గ్రాస్ వసుల్‌ను దక్కించుకున్న అతికొద్ది సినిమాల్లో ఒకటిగా గుంటూరు కారం నిలిచింది. ఇక మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

$1 Million+ 24 hours before to the show. ❤️

Enni locations ichaamannadhi kaadu Annayya.. Babu ki Record release ichaamaa… Record premiere number pettaamaa. Idhe Lekka..🤟🏻

Yes, we promised to release in record locations. Unfortunately , we are not able to. Can’t disclose the… pic.twitter.com/b4WL8BVuxW

— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 10, 2024

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...