Home Film News రవితేజ టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకులు ఎవరో తెలుసా..?
Film NewsSpecial Looks

రవితేజ టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకులు ఎవరో తెలుసా..?

‘మాస్ మహా రాజా’ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకునే ‘రవితేజ’ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. కెరీర్ ఆరంభంలో చిన్నాచితకా వేషాలు వేసి.. అంచెలంచెలుగా ఎదిగాడు. స్వయంకృషి తో, పట్టుదలతో స్టార్ గా ఎదిగి, మరెందరికో ఛాన్స్ లు ఇచ్చి వాళ్ళను కూడా స్టార్లను చేశాడు. ఇక ఇప్పుడు ఈగల్ సినిమాతో రవితేజ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న‌డు. రవితేజ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది.

Tollywood Actors

అయితే రవితేజ హీరోగా ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేశారు. ఇక ఇప్పుడు ఆ దర్శకుల‌కు సంబంధించిన వివరాలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులలో శ్రీనువైట్ల ఒకరు. నీకోసం సినిమాతో శ్రీనువైట్ల ఇండస్ట్రీకి పరిచయమై మొద‌టి సినిమాతోనే మంచి దర్శకునిగా పేరును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా మంచోడు అనే సినిమాతో అగస్త్యన్ అనే మరో కొత్త దర్శకుని తెలుగులో పరిచయం చేశాడు.

ఆ తర్వాత ఒక రాజు ఒక రాణి సినిమాతో రవితేజ యోగి అనే దర్శకుడిని తెలుగు తెర‌కు పరిచయం చేయ‌గ ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమాతో ఎస్ గోపాల్ రెడ్డి ని రవితేజ దర్శకుడుగా తెలుగులో పరిచయం చేశాడు. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను కూడా భద్రా సినిమాతో రవితేజ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అలాగే మెగా ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ ని కూడా షాక్ సినిమాతో, శంభో శివ శంభో సినిమాతో సముద్రఖని, డాన్ శీను మూవీ తో గోపీచంద్ మాలినని, పవర్ సినిమాతో బాబీని, టచ్ చేసి చూడు సినిమాతో విక్రమ్ సిరికొండని, రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో శరత్ మండవలను రవితేజ దర్శకులుగా పరిచయం చేశాడు.

 Tollywood Directors Who Are Introduced By Hero Ravi Teja, Srinu Vaitla, Agastyan-TeluguStop.com

స్టోరీ నచ్చితే హిట్ ప్టాప్‌ల‌తో సంబంధం లేకుండా దర్శకులకు అవకాశం ఇచ్చే విషయంలో రవితేజ ఇప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఈరోజు రవితేజ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. రాబోయే రోజుల్లో కూడా రవితేజ నెక్స్ట్ లెవెల్ లో సినిమాలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటారో లేదో చూడాలని. .

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...