Home Film News Venu: ప్రేమించిన అమ్మాయి కోసం అన్ని వేలు ఖ‌ర్చు పెట్టిన వేణు..త‌ర్వాత ఏమైందంటే..!
Film News

Venu: ప్రేమించిన అమ్మాయి కోసం అన్ని వేలు ఖ‌ర్చు పెట్టిన వేణు..త‌ర్వాత ఏమైందంటే..!

Venu: ప్రేమలో ప‌డితే మ‌నం ఎలా ఉంటామో, ఎలా ప్ర‌వ‌ర్తిస్తామో కూడా తెలియ‌దు. కాని ఆ మైకం నుండి బ‌య‌ట‌ప‌డ్డాక  అస‌లు విష‌యాలు తెలుసుకొని తీవ్ర నిరాశ‌ చెంద‌డం వంటి సంఘ‌ట‌న‌లు చాలానే చూశాం. బ‌ల‌గంతో మంచి హిట్ అందుకున్న జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్ వేణు తన లవర్ కోసం చేసిన ఖర్చు గురించి చెప్పి ఆశ్చర్య‌పరిచాడు. వేణు అంటే మొన్న‌టి వ‌ర‌కు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్‌గానే తెలుసు. కాని బ‌ల‌గం సినిమాతో ఆయ‌న‌లోని ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ బ‌య‌ట‌కు తీసాడు. ఈ  సినిమాకు పలు అంతర్జాతీయ  అవార్డ్స్ రావడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు సైతం వచ్చాయి. రీసెంట్‌గా గ్రూప్ 4లో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌శ్న వ‌చ్చింది.

తాజాగా వేణు త‌న జీవితంలో ఎదుర్కొన్న అనుభ‌వాల గురించి వెల్ల‌డించాడు. త‌న‌కి కూడా ఆటోగ్రాఫ్ లాంటి లవ్ స్టోరీ ఒకటి ఉంద‌ని చెప్పిన వేణు.. ల‌వ్ వ‌ల‌న జ‌రిగిన అవ‌మానంతో మ‌ళ్లీ ల‌వ్ చేయాలంటే భ‌యం వేసింద‌ని అన్నాడు.ఆర్టిస్ట్ అయిన స‌మ‌యంలో వేణుకి ఓ అమ్మాయి న‌చ్చి ఆమెని ల‌వ్ చేశాడు. త‌న పంచ్‌ల‌కి ఆమె బాగా న‌వ్వేద‌ట‌.అమ్మాయి ఇంటికి వెళ్లిన కూడా ఎవ‌రు ఏమనేవారు కాద‌ట‌. అంత కూల్‌గా న‌డుస్తుంది అనుకున్న స‌మ‌యంలో  ఓ రోజు ఫేక్ బర్త్ డే క్రియేట్ చేసుకుని ఆమెతోపాటు ఫ్రెండ్స్ అందర్నీ గోల్కొండ కోటకు తీసుకెళ్లి మ‌ధ్య మ‌ధ్య‌లో ఆమెతో  స‌ర‌దాగా మాట్లాడటం, జోకులేయడం అంతా చేశాను అని వేణు తెలియ‌జేశారు.

సాయంత్రం కూడా త‌న‌తో ఎక్కువ సేపు గ‌డ‌పాల‌ని అనిపించి నెక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లి ఓ పెద్ద హోటల్ డిన్నరిచ్చాను. ఇంటికొచ్చాక మొత్తం  లెక్కలు వేసుకుంటే మొత్తం రూ. 25 నుంచి 30 వేలు అయింది. అయితే ఖ‌ర్చు కన్నా కూడా అంద‌రిని గ్యాద‌ర్ చేయ‌డం, ఏర్పాట్లు చేసుకోవ‌డం ఇబ్బందిగా అనిపించింది. నా కోసం నా ఫ్యామిలీ అంతా ఎంతో చేస్తే.. వారి కోసం ఏమి చేయ‌కుండా, ఓ అమ్మాయి కోసం ఇంత చేశాను.  నా జీవితం గురించి ఆలోచించిన వాళ్ల కోసం ఏమి ఆలోచించ‌లేదేంటి అని చాలా బాధ‌ప‌డ్డాను అని వేణు తెలియ‌జేశారు. వేణు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...