Home Film News Khushi: వామ్మో..ఖుషి సినిమాలో పనిచేసిన వారికి అంత రెమ్యున‌రేష‌నా.. అంద‌రు షాక్..!
Film News

Khushi: వామ్మో..ఖుషి సినిమాలో పనిచేసిన వారికి అంత రెమ్యున‌రేష‌నా.. అంద‌రు షాక్..!

Khushi: విజయ్ దేవరకొండ, సమంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం ఖుషి. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ఈ సినిమాపై విజ‌య్, స‌మంత‌, శివ నిర్వాణ  చాలా హోప్స్ పెట్టుకున్నారు. విజ‌య్‌కి కొద్ది రోజులుగా వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రిస్తున్నాయి. చివ‌రిగా వ‌చ్చిన లైగర్ కూడా పెద్ద దెబ్బ కొట్టింది. ఇక స‌మంత విష‌యానికి వ‌స్తే చివరిగా న‌టించిన శాకుంత‌లం డిజాస్ట‌ర్ అయింది. ఇక టక్ జగదీష్ సినిమాతో శివ నిర్వాణ హిట్ ట్రాక్ తప్ప‌గా, ఆయ‌న కూడా మంచి విజ‌యం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ  ముగ్గురికి ఇప్పుడు ఖుషి సినిమా హిట్ కావ‌డం చాలా త‌ప్ప‌నిస‌రి. అయితే గ‌త కొద్ది రోజులుగా ఖుషి సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ సాగుతున్నాయి.  ఈవెంట్స్, ఇంట‌ర్వ్యూల‌తో నానా ర‌చ్చ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు విజ‌య్ దేవ‌రకొండ‌, స‌మంత‌, శివ నిర్వాణ రెమ్యున‌రేష‌న్ గురించి ఇప్పుడు జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది.  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న స‌మాచారం మేర‌కు  ఖుషి సినిమాకు గానూ విజ‌య్ దేవ‌ర‌కొండ 23 కోట్లు రెమ్యున‌రేష‌న్  తీసుకున్నాడట. ఇక క‌థానాయిక‌గా న‌టించిన సమంత అయితే ఏకంగా నాలుగున్నర కోట్లు రెమ్యున‌రేన్ అందుకుంద‌ట. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ అయితే పన్నెండు కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. ఇది విని ప్ర‌తి ఒక్కరు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏంటి వాళ్లకి అన్ని కోట్లు ఎలా ఇస్తున్నారు అంటూ కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. వీరి టాలెంట్‌కి అంత ఇచ్చేదెవ‌రు అంటూ కొంద‌రు తిట్టిపోస్తున్నారు కూడా.

ఇటీవ‌లి కాలంలో ఒక్క మంచి హిట్ కూడా లేని విజయ్ దేవరకొండకు కోట్లు అంటే ఎవ‌రికైన అనుమానం రాక‌మాన‌దు. మ‌నోడి రెమ్యున‌రేష‌న్ మ‌హా అంటే  పది నుంచి పదిహేను కోట్ల రేంజ్‌లో ఉంటుంది. స‌మంత విష‌యానికి వ‌స్తే రెండున్న‌ర కోట్లు ఇస్తారేమో, ఇక ద‌ర్శ‌కుడికి ప‌న్నెండు కోట్లు అస్సులు న‌మ్మేలా లేదు. ఐదు కోట్ల లోపే వీరి రెమ్యున‌రేష‌న్ ఉంటుంద‌ని అంటున్నారు. వీరి ముగ్గురికి ఎక్కువ ఎక్కువ ఇచ్చి  అవన్నీ రికవరీ చేయాలంటే.. సినిమా ఎంత భారీగా  కలెక్ట్ చేయాల్సి ఉంటుందని జనాలు ముచ్చ‌టించుకుంటున్నారు.  సెన్సార్ నుంచి కూడా క్లీన్ యూ సర్టిఫికేట్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం  పూర్తి కుటుంబ కథా చిత్రమని టీజర్, ట్రైలర్‌తో ఓ క్లారిటీకి వ‌చ్చేసారు నెటిజ‌న్స్

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...