Home Film News Anasuya: ఆ చిన్న త‌ప్పు వ‌ల‌న స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ‌..!
Film News

Anasuya: ఆ చిన్న త‌ప్పు వ‌ల‌న స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్న అనసూయ‌..!

Anasuya: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఈ షో క‌న్నా ముందు అనసూయ న్యూస్ రీడ‌ర్‌గా ప‌ని చేసేది. ఎప్పుడైతే జ‌బ‌ర్ధ‌స్త్ లోకి అడుగుపెట్టిందో అప్పుడు త‌న గ్లామ‌ర్ షోతో కుర్రకారుకి మ‌త్తెక్కించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో అన‌సూయ పేరు తెలుగు రాష్ట్రాల‌లో మారు మ్రోగింది. అయితే కొన్ని నెల‌ల క్రితం ప‌లు కార‌ణాల వ‌ల‌న యాంక‌రింగ్‌కి గుడ్ బై చెప్పి పూర్తి స్థాయి న‌టిగా మారింది. అన‌సూయ‌కి రంగ‌స్థ‌లంలోని రంగ‌మ్మ‌త్త పాత్ర  న‌టిగా మంచి గుర్తింపు తీసుకు రావ‌డంతో ఇక వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

అస‌లు అనసూయ ముందు నటి కావాలని అనుకుంద‌ట‌. వివాహానికి ముందు చాలా ప్రయత్నాలు కూడా చేశారట. అయితే అవేమి సక్సెస్ కాకపోవడంతో యాంకర్ గా మారింది.  గ్లామరస్ యాంకర్ అన్న ఇమేజ్  సొంతం చేసుకున్న ఈ భామ  పొట్టిబట్టల్లో స్కిన్ షోకి తెరలేపింది. త‌న‌పై ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ అదే విధంగా గ్లామ‌ర్ షో చేస్తూ, త‌న‌ని విమర్శించే వాళ్లకు కౌంటర్లు ఇస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు అన‌సూయ పూర్తి స్థాయి న‌టిగా మారిన కూడా ఆమెని న‌టిగా ఎవ‌రు గుర్తించ‌డం లేదు. అందంద‌, టాలెంట్ ఉన్నా కూడా ఆమెని   సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్ కి పరిమితం చేస్తున్నారు.

హీరోయిన్ పీస్ అయిన అన‌సూయని ఇలా క్యారెక్ట‌ర్ రోల్స్ కి ప‌రిమితం చేయ‌డం కొంద‌రు అభిమానులని బాధిస్తుంది. అయితే అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగి ఉంటే ఆమెకు లీడ్ క్యారెక్టర్స్ త‌ప్ప‌క వ‌చ్చేవ‌ని కొంద‌రు అంటున్నారు. యాంక‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో అన‌సూయ‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ ఇప్పుడంత క‌నిపించ‌డం లేద‌. సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చ  చేస్తూ, బికినీలో గ్లామ‌ర్ షో చేసిన కూడా అనసూయ‌కి ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. మ‌రి రానున్న రోజుల‌లో  అన‌సూయ ఏమైన యాంక‌రింగ్ వైపు అడుగులు వేస్తుందా, లేదంటే న‌టిగానే స్థిర‌ప‌డుతుందా అనేది చూడాలి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...