Home Film News Hero: అంత స్టార్ హీరోకి క‌నీసం రెండు సిగ‌రెట్స్ కొనే ప‌రిస్థితి కూడా లేదా..
Film News

Hero: అంత స్టార్ హీరోకి క‌నీసం రెండు సిగ‌రెట్స్ కొనే ప‌రిస్థితి కూడా లేదా..

Hero: సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంత‌ మంది సెల‌బ్రిటీలు ఒక‌ప్పుడు చాలా ద‌ర్జాగా ఉన్నా, త‌ర్వాత త‌ర్వాత మాత్రం పూట తిండి తిన‌డానికి కూడా చాలా ఇబ్బంది ప‌డ్డారు. అలాంటి వారిలో ప్ర‌ముఖ హీరో అబ్బాస్ ఒకరు. 90వ ద‌శ‌కంలో ఆయన ఒక సంచ‌ల‌నం.  ప్రేమ దేశం సినిమాతో  తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న అబ్బాస్ అప్ప‌ట్లో యూత్‌కి ఐకాన్‌గా నిలిచాడు. ఆయ‌న అంటే అమ్మాయిలు ప‌డి చ‌చ్చిపోయేవారు. ఇక  అబ్బాయిలైతే అబ్బాస్ కటింగ్  చేయించుకునేవారు. కెరీర్ మొద‌ట్లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోయిన  అబ్బాస్ 2015 తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు.

ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్ లోఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా,  ఆయన తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్న‌ట్టు తెలుస్తుంది. పలువురు దర్శక నిర్మాతలు కూడా ఆయన్ని మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని  ప్లాన్స్ చేస్తున్నార‌ట‌. అయితే మంచి క‌థ దొరికితే ప‌క్కాగా రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం క‌ల‌దు. అయితే అబ్బాస్ దుస్థితి ఒక‌ప్పుడు ఎంతో దారుణంగా ఉండేది. ఆ విష‌యాల‌ని స్వ‌యంగా  మీడియాకి వెల్ల‌డించాడు. డ‌బ్బు కోస‌మే తాను సినిమాల్లో న‌టించాన‌ని  చెప్పిన అబ్బాస్,  కొన్ని ప‌రాజ‌యాల కార‌ణంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు త‌లెత్త‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారాల్సివ‌చ్చింద‌ని తెలిపాడు.

ఇక ఈ న‌ట‌న జీవితం న‌చ్చ‌క‌పోవ‌డంతోనే  ఇండ‌స్ట్రీకి దూరంగా న్యూజిలాండ్‌లో వెళ్లి స్థిర‌ప‌డ్డాను. ఆ స‌మ‌యంలో కుటుంబాన్ని పోషించుకోవ‌డానికి ట్యాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన‌ట్లు అబ్బాస్ చెప్పుకొచ్చాడు. రెండు సిగ‌రెట్స్ కూడా కొనుక్కోవ‌డానికి చాలా ఇబ్బందులు ప‌డ్డాను. ఇక‌న్యూజిలాండ్ లో కొన్ని పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వ‌గా, వాళ్ళు నా కామెంట్స్ వక్రీకరించారు. నాకు మానసిక సమస్యలు తలెత్తాయని ప్ర‌చారం చేశారు. ఇక టెన్త్ గ్రేడ్ లో నేను ఫెయిల్ కాగా,  అదే సమయంలో గర్ల్ ఫ్రెండ్ వదిలేసిపోయింది. దాంతో చ‌నిపోవాల‌ని  రోడ్డు పక్కన నిల్చుని వేగంగా వచ్చే వాహనం క్రింద పడాలని అనుకున్నాను. అయితే అదే వాహనం వెనుక ఓ బైకర్ వస్తున్నాడు. నేను ఆ వాహనం కింద పడితే బైకర్ వెనక నుండి దాన్ని గుద్దే ప్రమాదం ఉంది కాబ‌ట్టి, నా వ‌ల‌నఎవ‌రిని ఆప‌ద క‌ల‌గొద్ద‌ని సూసైడ్ చేసుకోలేద‌ని గ‌తం గుర్తు చేసుకున్నాడు అబ్బాస్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...