Home Film News రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ క‌దా… మరి సూపర్ స్టార్ కృష్ణ రాముడిగా నటించిన విషయం మీకు తెలుసా…!
Film NewsSpecial Looks

రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ క‌దా… మరి సూపర్ స్టార్ కృష్ణ రాముడిగా నటించిన విషయం మీకు తెలుసా…!

మన భారతీయ చిత్ర పరిశ్రమలో పౌరాణిక సినిమాలు చేయాలంటే తెలుగు వారే చేయాలనేది అందరికీ తెలిసిన విషయమే.. మన టాలీవుడ్ నుంచి ఎన్నో పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఈ చిత్ర పరిశ్రమలో ఎవరు తీయని సినిమాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో చేశారు అంటే అతిశయోక్తి కాదు.. అందులో నటరత్న ఎన్టీఆర్ అంటే పౌరాణిక సినిమాలకు పెట్టింది పేరు.

ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే!,  senior-ntr-krishna-and-rama-role-movies

మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా తొలిసారిగా నటించారు.. ఆ పాత్ర ఈరోజుకి చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్రను చేయగలరు అనేవారు. అదేవిధంగా రాముడు గా కూడా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అంతేకాకుండా పౌరాణిక ప్రతి నాయకులు పాత్రలైనా రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు నటించి మెప్పించిన ఎన్టీఆర్.. రాముడుగా- కృష్ణుడుగా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో చేరగని ముద్ర వేసుకున్నాడు.

అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో జేమ్స్ బాండ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ అని అంటారు. ఆయ‌న ఎక్కువగా అటువంటి సినిమాల్లోనే నటించారు. ఆయన కెరీర్లు తక్కువగా పౌరాణిక సినిమాలో నటించారు అందులో కురుక్షేత్రం కూడా ఒకటి… ఈ సినిమాలో కృష్ణ.. అర్జునుడిగా నటించాడు. అయితే కృష్ణ రాముడిగా ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణ రాముడిగా ఏ సినిమాలో చేశారు అసలు రాముడు గా కృష్ణ ఎలా ఉంటారు.. అనేది ఇక్కడ చూద్దాం.

superstarkrishnainlordrama.jpg

సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు సినిమా మనం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప సినిమాలో ఈ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు.. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో కృష్ణని బ్రిటీష్ జ‌న‌ర‌ల్‌ తుపాకీతో కాల్చమని భారత సైనికులను ఆదేశిస్తాడు… ఆ సమయంలో భారతీయ సైనికులకు ఒక్కో విధంగా కనబడతాడు కృష్ణ
ఆ సన్నివేశంలోనే కృష్ణ ఒక సైనికుడికి రాముడుగా కనపడతాడు. అప్పుడు కృష్ణ రాముడుగా వేసిన ఆ చిన్న స్టిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కృష్ణ పౌరాణిక సినిమాలు చేసినవి బహు తక్కువ, అందులోనే రాముడు, కృష్ణుడు పాత్రలు అయితే అస్సలు వెయ్యలేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...