Home Film News Heroine Tomato Bag Theft: హీరోయిన్ టమాటాల బ్యాగ్ దొంగిలించిన వ్య‌క్తి..ఆ త‌ర్వాత ఏమైందంటే..!
Film News

Heroine Tomato Bag Theft: హీరోయిన్ టమాటాల బ్యాగ్ దొంగిలించిన వ్య‌క్తి..ఆ త‌ర్వాత ఏమైందంటే..!

Heroine Tomato Bag Theft: ఇటీవ‌ల సెల‌బ్రిటీలు సినిమాల‌తోనే కాదు సోష‌ల్ మీడియాలోను ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ని బేస్ చేసుకొని కూడా కొన్ని ఫ‌న్నీ వీడియోలు రూపొందించి వాటిని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల టమాటా ధ‌ర‌లు ఏ రేంజ్‌లో పెరిగాయో మ‌నం చూశాం. దీంతో యూట్యూబ‌ర్స్, సెల‌బ్రిటీలు ట‌మాటాల మీద తెగ వీడియోలు చేస్తున్నారు. ఎవ‌రికి నచ్చిన‌ట్టు వారు  టమాటాల రేట్లపై వారికి తోచిన విధంగా వీడియోలు చేస్తూ.. ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తమిళ స్టార్ నటి, టాలీవుడ్ లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్  ఓ ఫ‌న్నీ వీడియోని త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇది ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

వీడియాలో వరలక్ష్మీ శరత్ కుమార్  ఓ రాతి గోడ దగ్గర నిలబడి   మరొక అమ్మాయితో డీప్ గా మాట్లాడుతూ ఉంటుంది.ఆ స‌మ‌యంలో వ‌ర‌ల‌క్ష్మీ త‌న ఫోన్ తో పాటు ట‌మాటా బ్యాగ్ గోడ‌మీద పెట్టి రెండు చేతులు క‌ట్టుకొని నిలుచొని ఉంటుంది. ఆ స‌మ‌యంలో స‌డెన్‌గా ఓ వ్య‌క్తి వ‌చ్చి  వరలక్ష్మీ సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లిపోతాడు. దీనిని చూసిన  మరో అమ్మాయి ఈ విషయాన్ని వరలక్ష్మీకి చెప్ప‌గా ఫోనే కదా పోతే పోనీ అన్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది. కొద్ది సేప‌టి త‌ర్వాత  ఆ దొంగ వెనకనుంచి వచ్చి.. ఫోన్ అక్కడ పెట్టి..టమాటాల ప్యాక్ ను ఎత్తుకెళ్లిపోతాడు.

ఇది చూసిన వరలక్ష్మీ.. అప్పుడు  ఆ దొంగ వెంట పడతారు. అంటే సెల్ ఫోన్ క‌న్నా కూడా  టమాటాల విలువ ఎక్కువ‌ని  తెలియజేస్తున్నట్టుగా వరలక్ష్మీ శరత్ కుమార్  ఈ వీడియో చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది.  ప్ర‌స్తుతం ట‌మాట ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టిస్తుంది.  మొన్నటి వరకూ 100 నుంచి 150 వరకూ వీటి ధ‌ర ఉండ‌గా, ఇప్పుడు 200 కిలో రేటు పలుకుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఈ ధరలు ఇలానే ఉండ‌నున్నాయ‌ని తెలుస్తుంది. ట‌మాటా వ‌ల‌న కొంద‌రు కోటీశ్వ‌రులుగా కూడా మారుతున్నారు.ట‌మాటాల దొంగ‌త‌నాలు కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...