Home Film News Karate Kalyani: నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు.. క‌రాటే క‌ళ్యాణి ఆవేద‌న‌
Film News

Karate Kalyani: నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు.. క‌రాటే క‌ళ్యాణి ఆవేద‌న‌

Karate Kalyani: న‌టిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన క‌రాటే క‌ళ్యాణి గ‌త కొంత కాలంగా వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆ మ‌ధ్య ఓ యూట్యూబ‌ర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన క‌ళ్యాణి ఇటీవ‌ల ఖమ్మంలో చేప‌ట్టిన‌ కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుని అడ్డుకుంది. ఈ విషయంలో ఆమె బహిరంగంగా వ్యాఖ్యలు, గొడవలు చేయడంతో పాటు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన నోటీసు కూడా లెక్క కూడా చేయ‌లేదు. దీంతో ఆమెని మా నుండి తొల‌గించారు. దీనిపై కూడా ఆమె కొంత ఘాటు కామెంట్స్ చేసింది. త‌న‌ని చంపేందుకు కూడా కొంద‌రు ప్లాన్ చేస్తున్నార‌ని కూడా క‌రాటే క‌ళ్యాణి స్ప‌ష్టం చేసింది.

తాజాగా క‌ళ్యాణి తన ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారంటూ.. కొత్త పల్లవి అందుకుంది. రీసెంట్‌గా ఈవిడ‌ హైదరాబాద్ షీ టీంని కలిసి తన ఫోటోలను పలువురు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. త‌ను న‌టించిన పాత సినిమాల‌లోని ఫొటోలని మార్ఫింగ్ చేసి ఆ ఫొటోల‌ని తెగ వైర‌ల్ చేస్తున్నారంటూ షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేసింది. వారు మ‌రింత రెచ్చిపోక‌ముందే త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా క‌ళ్యాణి పేర్కొంది. ఇక లలిత్ కుమార్, ఓంకార్, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, దుర్గారావు, రాంబాబు, నితీష్, గుప్తా, నర్సింహా గౌడ్.. అనే పలువురు వ్యక్తులపై కూడా కేసు పెట్టింది. వారు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ..తన పరువుకు భంగం కలిగిస్తున్నారని, త‌న‌ ఎదుగుదల చూడ‌లేక‌ ఇలా చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నాంటూ క‌ళ్యాణి త‌న ఫిర్యాదులో పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం క‌రాటే క‌ళ్యాణి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..త‌న‌కు ప్రాణహాని ఉంది అని తెలియ‌జేసింది.. చాలా మందికి నాపై ఎంత కోపం ఉంది. ఇటీవ‌ల నా కొత్త కారులో ఓ ప్రోగ్రాంకి వెళ్లి వస్తుంటే కారు టైర్స్ పేలిపోయాయి. హైవే మీద అయితే కచ్చితంగా కారు పల్టీ కొట్టి ఉండేది.. హైవే పక్కన చిన్న రోడ్ లో మెల్లిగా వ‌స్తున్నాం కాబ‌ట్టి ప్ర‌మాదం త‌ప్పింది. ఒక సైడ్ ఉన్న టైర్స్ ని ఎవ‌రో కోసేశారు. మెకానిక్ కి చూపిస్తే ఇవి కావాలని కోసినట్టే ఉందని ఆయ‌న అన్నాడు. నా మీద అంత కోపం పెట్టుకొని నా కొత్త కారుని అలా చేశారని క‌ళ్యాణి తెలియ‌జేసింది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...