Home Film News Mega Vs Allu: ఇది చూశాక కూడా మెగా వ‌ర్సెస్ అల్లు అని ఎలా అన‌గ‌ల‌రు.. ఇక ఆపేయండి చాలు..!
Film News

Mega Vs Allu: ఇది చూశాక కూడా మెగా వ‌ర్సెస్ అల్లు అని ఎలా అన‌గ‌ల‌రు.. ఇక ఆపేయండి చాలు..!

Mega Vs Allu: సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెర‌గ‌డం అందులో చాలా మంది యాక్టివ్‌గా ఉండ‌డం వ‌ల‌న కొన్ని ఇబ్బందులు కూడా త‌లెత్తుతున్నాయి. ముఖ్యంగా త‌ప్పుడు ప్ర‌చారాలు జోరుగా సాగుతున్నాయి. దీని వ‌ల‌న సెల‌బ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొన్నాళ్లుగా మెగా వ‌ర్సెస్ అల్లు వార్ న‌డుస్తుంద‌ని ఎన్నో ప్ర‌చారాలు సాగుతున్నాయి. అప్పుడెప్పుడో ‘చెప్పను బ్రదర్’ అనే మాటతో మొదలైన ‘మెగా వ‌ర్సెస్‌ అల్లు’వారి ఫ్యాన్స్ గొడవల ప్రస్థానం ఇప్ప‌టికీ కొనసాగుతుంది. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా లోనే ఈ డిస్క‌షన్ నడిచేది. కాని ఆ త‌ర్వాత అది అభిమాన సంఘాల మీటింగ్స్ కి కూడా చేరింది.

అప్ప‌ట్లో తమిళ చిత్ర పరిశ్రమలోని అభిమానుల మధ్య ఇలా తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ వాతావరణం తెలుగు ప్రాంతాలను కూడా తాకింది. ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఊహించని విధంగా కొన్నాళ్ల నుండి మాటల యుద్ధం కొనసాగుతోంది.వారు ఎక్క‌డ ఏం మాట్లాడిన కూడా దానిపై ఓ క‌న్నేసి వివాదం సృష్టిస్తున్నారు. అయితే తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటో చూసి మెగా, అల్లు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. రెండు ఫ్యామిలీల మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని ఆనంద‌ప‌డుతున్నారు.

జూన్ 14న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల యానివ‌ర్స‌రీ కాగా, వారికి ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇదే క్ర‌మంలో అల్లు స్నేహ సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్ షేర్ చేస్తూ విషెస్ తెలియ‌జేసింది. అయితే ఈ ఫోటో లో అల్లు అర్జున్, రాంచరణ్ సతీసమేతంగా కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి హాజరైనప్పుడు అల్లు అర్జున్, చరణ్ ఇలా తమ భార్యలతో ఫోటో దిగారు. ఈ పిక్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇది చూసిన వారంద‌రు కొణిదెల, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు లేవ‌ని వారు సంతోషంగా ఉన్నార‌ని తెలియ‌జేస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...