Home Film News Indraja: ఇంద్ర‌జ పెళ్లి ఖర్చు రూ.7500..భార్య కోసం ఆమె ముస్లిం భ‌ర్త ఎంత పెద్ద త్యాగం చేశాడో తెలుసా?
Film News

Indraja: ఇంద్ర‌జ పెళ్లి ఖర్చు రూ.7500..భార్య కోసం ఆమె ముస్లిం భ‌ర్త ఎంత పెద్ద త్యాగం చేశాడో తెలుసా?

Indraja: ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఇంద్ర‌జ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అప్ప‌టి స్టార్ హీరోల‌తో క‌లిసి ఎన్నో సినిమాల‌లో న‌టించి మెప్పించింది.  ఇంద్రజ అసలు పేరు రజతి కాగా, ఆమె  ఎక్కువగా తెలుగు, మలయాళ సినిమాల‌తో పాటు కన్నడ మరియు తమిళ చిత్రాల్లో సైతం నటిచింది. చిన్నతనం నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకున్న ఇంద్రజ మాధవపెద్ది మూర్తి గారి దగ్గర నాట్యంలో శిక్షణ పొంది మంచి పేరు తెచ్చుకుంది. ఇంద్రజ మంచి గాయ‌ని కూడా. 1995 నుంచి ఒక పదేళ్ల పాటు సినిమా పరిశ్రమలో కొన‌సాగుతూ ఉన్న ఇంద్ర‌జ‌.. 1995 సంవ‌త్స‌రంలో ఏకంగా 15 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. 2007లో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఇంద్ర‌జ పెళ్లి చేసుకొని ఏడేళ్ల‌పాటు సినిమాల‌కి దూర‌మైంది.

ముస్లిం వ్య‌క్తిని ఇంద్ర‌జ ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారికి సారా అనే కూతురు ఉంది.  ఇంద్రజ భర్త పేరు మొహమ్మద్ అబ్సర్ కాగా, ఇతడు బిజినెస్ చేస్తూనే ప‌లు  సీరియల్స్ లో కూడా నటించాడు. అయితే  ప్యూర్ బ్రాహ్మిన్ అయినా ఇంద్రజ ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్ద  హాట్ టాపిక్ అయింది. వారి పెళ్లికి వచ్చింది కేవ‌లం  13 మంది.. ఓన్లీ రూ. 7,500 మాత్రమే ఖర్చు అయ్యింది అని తన సింపుల్ మ్యారేజ్ గురించి ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది ఇంద్ర‌జ‌

ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా కూడా.. ఇంద్ర‌జ బ్రాహ్మిణ్‌గా ఉంటూ త‌న ఆచార వ్య‌వ‌హారాలు కొన‌సాగిస్తూ వచ్చింది. అయితే తాను త‌న  మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కాని అతను హిందు.. ముస్లిం అని ఏ మాత్రం  చూడలేదు అని పేర్కొంది ఇంద్ర‌జ‌. మతం చూసి, కులం చూసి ఇష్టపడితే అది ప్రేమ ఎలా అవుతుంది. ఇది నేను చెబితే  మూవీ డైలాగ్‌లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం మూవీ డైలాగ్ కాదండోయ్.. ఇది నా రియల్ లైఫ్ డైలాగ్ అని ఇంద్ర‌జ చెప్పుకొచ్చింది. అయితే  మహమ్మద్ కుటుంబ సభ్యులు ముస్లింస్ అయినప్పటికీ ఇంద్రజ మీద ఉన్న ప్రేమతో వారు కూడా మాంసాహారాన్ని తినడం పూర్తిగా మానేశారట. ఇక ఇంట్లో తన కుటుంబ సభ్యులు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటారని, వివాహమైన రోజు నుంచి ఇప్పటివరకు ఇంట్లో మాంసాహారాన్ని వారు అస్సలు వండలేదు అని ఇంద్రజ చాలా గర్వంగా చెప్పుకుంటారు. బ‌య‌ట తింటే నేను ఎప్పుడు అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని ఇంద్రజ చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...